ఎంసెట్‌పై నీట్ ఎఫెక్ట్: దటీజ్ కేసీఆర్.. వాళ్లు కాదన్నా చేసి చూపారు (పిక్చర్స్)

హైదరాబాద్: వైద్య విద్య సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేయాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ మెడికల్ పరీక్షకు విద్యార్థుల హాజరు శాతం స్వల్పంగా తగ్గింది. గత ఏడాది 90 శాతం హాజరు నమోదు కాగా ఈసారి 88.02 మాత్రమే హాజరు ఉంది.

ఇంజినీరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారిలో 92.34 శాతం మంది పరీక్ష రాశారు. ఆదివారం ఎంసెట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. తెలంగణ రాష్ట్ర ఎంసెట్‌ను ఆదివారం రెండు రాష్ట్రాల్లో 470 కేంద్రాల్లో నిర్వహించారు.

ఎంసెట్ పరీక్షలో ఈసారి పలు కొత్త విధానాలు ప్రవేశ పెట్టారు. బయోమెట్రిక్ పరికరాల ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు, ఫోటోలు సేకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ఏడాది ఏపీలోనూ విశాఖ, విజయవాడ,తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

 ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

ఈ యేడాది అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణ ఎంసెట్ పరీక్ష జరిగింది. కొన్ని సంవత్సరాలుగా ప్రయివేటు విద్యాసంస్థల భాగస్వామ్యంతో సాగిన ఎంసెట్‌ ఈ యేడాది అందుకు భిన్నంగా జరిగింది.

ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

తమ భాగస్వామ్యం లేకుండా ఎంసెట్‌ నిర్వహణ అసాధ్యమనుకున్న ప్రైవేటు విద్యా సంస్థల ఆలోచనకు అధికారులు అడ్డుకట్ట వేశారు.

ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

పకడ్బందీ ప్రణాళికతో 466 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఏర్పాటు చేసి పరీక్షను దిగ్విజయంగా నిర్వహించారు. తద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ప్రవేశ పరీక్షల నిర్వహణకు సిద్ధమని నిరూపించారు.

ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

తొలి షెడ్యూల్‌ ప్రకారం ఎంసెట్‌ ఈనెల 2వ తేదీన జరగాలి. అయితే ప్రయివేటు విద్యా సంస్థల బంద్‌ నేపథ్యంలో పరీక్ష 15వ తేదీకి వాయిదా పడింది.

 ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

ప్రయివేటు కాలేజీల్లో పోలీసుల తనిఖీలకు వ్యతిరేకంగా బంద్‌ నిర్వహించిన విద్యాసంస్థల జేఏసీ ఎంసెట్‌కు సెంటర్లు ఇవ్వలేమని పరీక్షకు మూడు రోజుల ముందు ప్రకటించింది.

 ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

దీంతో స్వయంగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్‌ ఎంసెట్‌ను వాయిదా వేసి, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహించాలని ఆదేశించారు. దీంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్న అధికారుల్లో ఆందోళన మొదలైంది.

 ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

అయితే సర్కారు ఆదేశాల మేర కు ఉన్నత విద్యామండలి, ఎంసెట్‌ అధికారులు నాలుగైదు రోజులు అవిశ్రాంతంగా శ్రమించి మెరుగైన ప్రభుత్వ విద్యాసంస్థలను గుర్తించారు.

 ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

ఇతర ప్రభు త్వ సంస్థలనూ పరీక్ష కేంద్రాలకు సిద్ధం చేశారు. దాదాపు 2.5లక్షల మంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.

 ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

అప్పటికే ముద్రించిన హాల్ టికెట్లను రద్దు చేసి, కొత్త హాల్‌ టికెట్లు పంపిణీ చేశారు. ఇక ప్రయివేటు కాలేజీల సహకారం లేకుండా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ ఎలా? అనుకున్న దశలో ఆ విధానంలోనూ పరీక్షను విజయవంతం చేశారు.

 ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

తొలిసారిగా ప్రభుత్వ సంస్థల్లో నిర్వహించిన ఎంసెట్‌ విజయవంతం కావడంతో ఇకపై ప్రయివేటు భాగస్వామ్యం లేకుండా ప్రవేశ పరీక్షలను నిర్వహించడంపై అధికారులు ఆలోచిస్తున్నారు.

 ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్‌ నిర్వహణపై ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆన్‌లైన్‌ ఎంసెట్‌ సక్సెస్‌ కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్త్తే.. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు సిద్ధమని చైర్మన్‌ పాపిరెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+