వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా ఎఫెక్ట్: పుదుచ్చేరిలోనూ తమిళిసైకి నిరసన సెగ; ప్రతిపక్షాల డిమాండ్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న తమిళిసై ఇప్పుడు మరో కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళిసైకి అక్కడ కూడా నిరసన సెగ తగులుతోంది.

పుదుచ్చేరిలోనూ తమిళిసైకి నిరసన సెగ

పుదుచ్చేరిలోనూ తమిళిసైకి నిరసన సెగ

తమిళిసై ను లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలగించాలంటూ అక్కడ విపక్షాల నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ గా కాకుండా రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నాని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం నుండి ఏ పరిస్థితి అయితే గవర్నర్ కు ఉందో, పుదుచ్చేరిలో ప్రతిపక్షాల నుండి అటువంటి పరిస్థితి ఆమె ఎదుర్కొంటోంది. రాష్ట్రానికి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించాలి అని పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్ల తీరుపై అసహనం

బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్ల తీరుపై అసహనం

పూర్తిస్థాయి లెఫ్టినెంట్ గవర్నర్ గా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావాలని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ వి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. బిజెపియేతర రాష్ట్రాలలో, బిజెపి పాలిత రాష్ట్రాలలోనూ గవర్నర్లు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్లు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని, బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గవర్నర్ కు తెలంగాణా ఎఫెక్ట్ ... పుదుచ్చేరిలో కూడా

గవర్నర్ కు తెలంగాణా ఎఫెక్ట్ ... పుదుచ్చేరిలో కూడా


ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తి కావాలని అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గవర్నర్ తమిళిసై కి టిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కేంద్ర పెద్దల వద్దకు చర్చకు వెళ్ళింది. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారటంతో పుదుచ్చేరిలోనూ ఆమెను వ్యతిరేకిస్తున్నారు.

 తనకు జరుగుతున్న అవమానాలను ఏకరువు పెట్టిన తమిళిసై .. టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్

తనకు జరుగుతున్న అవమానాలను ఏకరువు పెట్టిన తమిళిసై .. టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్

ఇక ఢిల్లీ వేదికగా గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వం తన అవమానిస్తున్న తీరును ఏకరువు పెట్టి అధికార టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ వ్యవస్థపై ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారంటూ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, తాను గవర్నర్ గా ఎటువంటి పక్షపాతం లేకుండా పని చేస్తున్నానని గవర్నర్ తమిళిసై తెలిపారు. గవర్నర్ వ్యాఖ్యలకు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు నేతలు కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణాలో ఉన్న పరిస్థితి పుదుచ్చేరిలోనూ రిపీట్ .. లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలగించాలని డిమాండ్

తెలంగాణాలో ఉన్న పరిస్థితి పుదుచ్చేరిలోనూ రిపీట్ .. లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలగించాలని డిమాండ్

ఇక తాజాగా మరోమారు ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తమిళిసై తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి కేంద్రానికి చెప్పానని, కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది అంటూ మళ్లీ వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తమిళిసై పై అధికార పక్షం నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక ఇదే సమయంలో పుదుచ్చేరిలోనూ తమిళిసై పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆమెను లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలగించాలంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం గవర్నర్ తమిళిసై రెండు చోట్లా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

English summary
Governor Tamilisai is also facing protests in Puducherry with the Telangana effect. Opposition groups demands for her removal as lieutenant governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X