ఖర్చంతా మాదే.. కారు పంపిస్తాం: మీ ఓటు మాకే: వారికి అభ్యర్థుల వినతి!!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు చాలా ముఖ్యమైన, కీలకమైన వారి రాజకీయ భవితవ్యాన్ని నిర్ధారించే ఎన్నికలు కావటంతో అన్ని పార్టీల వారు చాలా ఫోకస్ తో పని చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని నేతలు తెగ తంటాలు పడుతున్నారు.

ఈసారి తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు అధికార బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే రెండు దఫాలు అధికారాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ మూడోసారి అధికారం కోసం ఓటర్లను అభ్యర్ధిస్తోంది. ఇక కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు గెలవటం తప్పనిసరి. ఇక బీజేపీ తెలంగాణాలో బీ ఆర్ ఎస్ ను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది.

telangana election: candidates ready to bring voters who are in other places

ఇందులో భాగంగా నియోజక వర్గాలలో ఓటు హక్కు కలిగి ఉండి ఇతర ప్రాంతాలలో జీవనోపాధికి వెళ్ళిన వారిని సైతం నియోజకవర్గాలకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధి కోసం ఆయా గ్రామాల నుండి హైదరాబాద్ వంటి నగరాలకు, పట్టణాలకు వెళ్ళిన వారికి ఈ సమయంలో డిమాండ్ బాగా పెరిగింది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు వారికి ఫోన్లు చేసి వారిని ఓటేయటానికి రమ్మని ప్రాధేయ పడుతున్నారు.రాను పోను ఖర్చులు తామే భరిస్తామని చెబుతూ రమ్మని పిలుస్తున్నారు. వారు రావటానికి కొన్ని నియోజక వర్గాలలో అయితే ఏకంగా వాహనాలను పెడుతున్నారు. చెన్నై, ముంబై, షోలాపూర్ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిన వారిని కూడా రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

డబ్బుల ఖర్చు ఎంతైనా సరే ప్రతీ ఓటు ముఖ్యమే అని నేతలు ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను రప్పించే పనిలో పడ్డారు.మాకే ఓటు వెయ్యాలని ఎవరికి వారు వారిని అడుగుతున్నారు. దీంతో ఏ పార్టీ వారికి ఎస్ చెప్పాలి అన్నది వారికి కన్ఫ్యూజన్ గా మారింది. అభ్యర్థులు ఈ పనిని తమ అనుచరులకు అప్పగించి వీరి ఓట్ల కోసం ఫాలో అప్ చేస్తున్నారు. మరి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ఏ పార్టీని ఆదరిస్తారో తెలియాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+