తెలంగాణా ఎన్నికలు: ఢిల్లీ హైకోర్టుకు బీఆర్ఎస్.. కారణమిదే!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద కష్టం వచ్చి పడింది. చాలాకాలంగా బి ఆర్ ఎస్ పార్టీ తమ పార్టీ గుర్తులను పోలి ఉన్న గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేసినా, అనేకమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఇప్పటివరకు ఎన్నికల సంఘం నుంచి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ గుర్తు అయిన కారు గుర్తును పోలిన గుర్తుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కింది.గత కొన్ని నెలలుగా తమ పార్టీ ఎప్పుడు గుర్తును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించ వద్దని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదులు చేసింది. గతంలో అలా కేటాయించటం వల్ల తమకు నష్టం జరిగిందని పేర్కొంది.

అయితే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు.. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్నబీఆర్ఎస్ పార్టీ కారును పోలి ఉన్న గుర్తులను ఏ పార్టీకి కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించేలా అభ్యర్థిస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించడం వల్ల తమకు నష్టం జరుగుతోందని రిట్ పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టులో బిఆర్ఎస్ పార్టీ తరపున న్యాయవాది మోహిత్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందని, పలు రాష్ట్రాల్లో పోటీకి కూడా సిద్ధమవుతుందని పేర్కొన్న ఆయన, ఆయా రాష్ట్రాలలో కారు గుర్తును పోలిన గుర్తులు ఉంటే పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, ఆ గుర్తులను ఏ పార్టీకి కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
మరి దీనిపై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయిస్తారేమోనన్న భయంతోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బి ఆర్ ఎస్ నేతలు. ప్రస్తుతం ఈ సమస్య బీఆర్ఎస్ కు సంకటంగా మారింది.












Click it and Unblock the Notifications