Telangana elections: సామాన్యుడిలా మెట్రోలో జనాల మధ్య నిలబడే ప్రయాణించిన కేటీఆర్.. ఏం చేశారంటే!!

తెలంగాణా మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ దిశగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ప్రజల మద్దతు కూడగట్టటం కోసం ఆయన శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణించారు. రాయదుర్గం స్టేషన్ నుంచి బేగం పేట వరకు మెట్రో ప్రయాణించిన కేటీఆర్ రైలులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడారు. మెట్రో రైలులో ప్రయాణికులతో సామాన్యుడిలా మాట్లాడిన కేటీఆర్ నిల్చునే మెట్రోలో ప్రయాణం చేశారు. విపరీతమైన రద్దీలో కేటీఆర్ మెట్రోలో ప్రయాణం చెయ్యటం ఇప్పుడు రాజకీయవర్గాలలోనూ, సామాన్య ప్రజలలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telangana elections: Minister KTR traveled in metro and spoke with public

మంత్రి కేటీఆర్ రొటీన్ ప్రచారానికి భిన్నంగా ఈ తరహాలో సామాన్యుల వద్దకు, వివిధ వర్గాల వద్దకు నేరుగా వెళ్లి ముచ్చటిస్తున్నారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత సాధించిన ప్రగతిని వారికి వివరిస్తున్నారు. ఒకపక్క రోడ్ షోలు, సమావేశాలతో హోరెత్తిస్తున్న కేటీఆర్ మరోపక్క యువతతో ముచ్చటించటం, మెట్రోలో ప్రయాణించి ప్రజలతో నేరుగా మాట్లాడటం వంటి చర్యలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు.

ఇక మంత్రి కేటీఆర్ మెట్రో లో ప్రయాణం చెయ్యటంతో ప్రయాణం చేస్తున్న వారు కేటీఆర్ తో మాట్లాడటానికి ఉత్సాహం చూపారు. కొందరు కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకోగా, మరికొందరు వీడియోలు తీసుకున్నారు. మొత్తంగా కేటీఆర్ తమతో పాటు మెట్రోలో ప్రయాణం చెయ్యటంతో మెట్రో లో సందడి నెలకొంది.

ఇదిలా ఉంటే BRS ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన "ప్రగతి ప్రస్థానం ...ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది " అన్న పుస్తకాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, తారక రామారావు ఈ రోజు ఆవిష్కరించారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేసిన పథకాలు, కార్యక్రమాలు, విధానాల ఫలితాలు రాష్ట్రంలోని గడప గడపకూ చేరాయని ఈ సందర్భంగా అన్నారు. ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితమవుతామని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+