తెలంగాణా ఎన్నికలు: రంగంలోకి నందమూరి వారి ఆడపడుచు; అక్కడ టీడీపీ వ్యూహం!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 87 స్థానాల్లో పోటీకి రెడీ అయిందని, ఈ ఎన్నికలను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, జనసేనతో పొత్తు విషయం పైన ఆలోచిస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.

ఒకపక్క చంద్రబాబు జైల్లో ఉండి తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న టైంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో టిడిపి ఎన్నికల బరిలో ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లు అయినా టిడిపి తన ఖాతాలో వేసుకుంటుంది అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.

Telangana Elections: Nandamuri women enter the field; TDP strategy here!

క్షేత్రస్థాయిలో టిడిపికి ప్రజలలో బలం ఉందని, తమ ఓటు బ్యాంకు నుండి నష్టపోకుండా ఉండడం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాలైన గట్టిగా సాధించాలని పట్టుదలతో ఉన్న టిడిపి నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచును రంగంలోకి దించనుంది.

2018 ఎన్నికలలో తొలిసారి నందమూరి కుటుంబం నుంచి నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తుల లో భాగంగా పోటీ చేసిన నేపథ్యంలో ఆమె గెలుస్తుంది అని అంతా భావించారు. నందమూరి బాలకృష్ణ వంటి వారి ప్రచారం చేయడం కూడా కలిసి వస్తుందని నమ్మారు. ఊహించని విధంగా సుహాసిని ఓటమిపాలయ్యారు.

ప్రస్తుతం మరోమారు ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టిడిపి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి నందమూరి సుహాసిని ఎల్బీనగర్ నియోజకవర్గం, కూకట్పల్లి నియోజకవర్గం నుండి.. రెండు చోట్ల నుండి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈసారి సుహాసినిని గెలిపించుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.

సెటిలర్లు ఎక్కువగా ఉండే ఎల్బీనగర్ తో పాటు కూకట్పల్లి సీటును సుహాసినికి కేటాయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి సుహాసిని ఈసారైనా ఓటర్ల మనసు గెలుచుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+