ఇంతకీ.. తెలంగాణపై ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోంది?
Atma Sakshi exit polls 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో వివిధ సంస్థలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు అందుతున్నాయి.
తెలంగాణపై ఆత్మాసాక్షి (Atma Sakshi) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls) వెలువడ్డాయి. జాతీయ స్థాయి సంస్థలున నిర్వహించిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్.. అందరి దృష్టినీ ఆకర్షించినట్టయింది.

తెలంగాణలో అధికార భారత్ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని తేల్చి తేల్చిందీ ఎగ్జిట్ పోల్. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలాన్ని అందుకుంటుందని పేర్కొంది. 60 స్థానాల మేజిక్ ఫిగర్‌ను బీఆర్ఎస్ అందుకుంటుందని అంచనా వేసింది.
గులాబీ పార్టీకి 58 నుంచి 63 స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడింది. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ ఆశలు గల్లంతవుతాయని ఆత్మసాక్షి గ్రూప్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది. ఆ పార్టీ ప్రయత్నాలేవీ ఫలించబోవని వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీ 48 నుంచి 51 స్థానాలకు పరిమితమౌతుందని ఆత్మసాక్షి వివరించింది. బీజేపీ ఏడు నుంచి ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంటుంది. అఖిల భారత్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు ఏడు నుంచి ఎనిమిది సీట్లు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒకటి లేదా రెండు స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications