Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ లో దావోస్ ఫాలో అప్ సమ్మిట్: అమెరికాకు రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటన విజయవంతమైందని, ఈ సందర్భంగా సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రైజింగ్ 4047 విజన్ డాక్యుమెంట్ కు అంచనాలకు మించిన స్పందన లభించిందని, మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో నిర్దేశిత లక్ష్యాలు, దార్శనికతను తెలియశామని వివరించింది.

హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ లో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 5.75 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులు సాధించింది. దీనికి సంబంధించిన ఎంఓయూలను కుదుర్చుకుంది. దీనికి కొనసాగింపుగా దావోస్ వేదికగా అదే స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించిందని పేర్కొంది. రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, సమగ్రాభివృద్ధిపై విజన్ లక్ష్యాల గురించి రేవంత్ రెడ్డి, మంత్రుల టీమ్ ప్రపంచానికి చాటి చెప్పాలన్న తమ ప్రభుత్వ సంకల్పం నెరవేరింది.

Telangana Eyes Hyderabad as Host for WEF Follow-Up Summit to Accelerate MoU Decisions

మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రతినిధి బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. అలాగే ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUలు) కుదుర్చుకుంది. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు.

ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాలకు హాజరయ్యారు. దావోస్ సమ్మిట్ కు ఫాలో అప్‌గా జూలై/ఆగస్టులో హైదరాబాద్‌లో ఓ భారీ మావేశాన్ని నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని, దీనికి సానుకూల స్పందన లభించిందని పేర్కొంది.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ తరహాలోనే ఈ ఫాలో అప్ సదస్సు ఉంటుందని, వివిధ దేశాలు, మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన ఛైర్మన్లు, సీఈఓలు దీనికి హాజరయ్యేలా, దీన్ని నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తోన్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అమెరికా పర్యటన చేపట్టారని వివరించింది. దావోస్ పర్యటన ముగించుకుని ఆయన జూరిచ్ చేరుకున్నారు. అక్కడి నుంచి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారత్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+