పాదాభివందనం: పవన్ 'సీమాంధ్ర' సభకు తెలంగాణ ఫ్యాన్స్, అందుకే రాక
హైదరాబాద్/కాకినాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు అశేష అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని పది జిల్లాల నుంచి ఆయన సభకు తెలంగాణ అభిమానులు కూడా కాకినాడకు వచ్చారు, వస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ధర్మపురి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన యువత ఇప్పటికే కాకినాడలోని జేఎన్డీయూ మైదానానికి చేరుకుంది.
గందరగోళమొద్దు: పవన్ సభ, కాకినాడలో ఆంక్షలు, ప్యాకేజీపై ఎలా..
తామంతా పవన్ కళ్యాణ్‌కు పెద్ద అభిమానులమని, ఆయనేం మాట్లాడతారో వినేందుకే వచ్చామని చెబుతున్నారు. సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది. అయినప్పటికీ ఉదయం నుంచే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
మా మద్దతు: తెలంగాణ అభిమానులు
పవన్ కళ్యాణ్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలంగాణ నుంచి తరలి వచ్చిన అభిమానులు చెప్పారు. తెలుగు ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలన్నారు. అందుకే పవన్ ప్రత్యేక హోదా ఉద్యమానికి తాము మద్దతిస్తున్నామని చెప్పారు.

ఈ సభకు మూడంచెల బారికేడ్లు, భద్రతను ఏర్పాటు చేసిన పోలీసు వర్గాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా నగరమంతా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
సాయంత్రం జరగనున్న బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. లక్ష మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాత్ రూంలు కూడా ఏర్పాటు చేశారు.
క్లారిటీ ఇచ్చాక సభ కాబట్టి సస్పెన్స్
కేంద్రం నుంచి ప్రత్యేక హోదా పైన క్లారిటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సభ జరుగుతుంది. కాబట్టి ఆయన ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ నుంచి వచ్చారు.. పాదాభివందనం
పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణ నుంచి, అటు కొసకు ఉన్న అదిలాబాద్ జిల్లా నుంచి కూడా వచ్చారని, అందుకు పాదాభివందనం అని సీమాంధ్ర జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నారు. తమ ఉద్యమానికి అందరి మద్దతు ఉందన్నారు.












Click it and Unblock the Notifications