వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీకి ముందే 4,000 నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. మొదలైన కసరత్తు

తెలంగాణలో అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు క్యాబినెట్ మంత్రులంతా అదివారం రాత్రి ముఖ్యమంత్రి అధికార నివాసంలో భేటీ అయ్యారు.

మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ నేతృత్యంలో ఈ సమావేశం జరిగింది. సోమ, మంగళవారాల్లో జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరపాలని ఇందులో నిర్ణయించారు.

పాత జిల్లాల వారీగా పదవుల భర్తీకి ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పజెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే దాదాపు 4 వేల నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Telangana to fill up over 4,000 nominated posts soon

ఇప్పటికే రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించినా డైరెక్టర్ పదవులను మాత్రం భర్తీ చేయలేదు. వాటితోపాటు జిల్లా స్థాయిలో పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులు తప్ప జిల్లాల్లో ఇతర పోస్టులను భర్తీ చేయలేదు.

దేవాలయ కమిటీలు, గ్రంథాలయ కమిటీలతోపాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులకు ఇప్పుడు ఎంపిక జరగనుంది. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, శాప్, ఖనిజాభివృద్ధి సంస్థ వంటి కార్పొరేషన్లలో పోస్టులు ఇప్పుడు భర్తీ చేయనున్నారు.

English summary
The Exercise is going on to fill the nominated posts in Telangana State. They are going to fill over all 4000 various non-official posts of government bodies. The high profiles of the party were met in a meting on Sunday at KCR's Official Residence under theleadership of Cabinet Ministers KTR, Harish Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X