పాశమైలారం ప్రమాద ఘటనపై నిపుణుల కమిటీ ఏర్పాటు

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 38 మంది కార్మికులు మృతి చెందారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

తెలంగాణలో తీవ్ర విషాదం నింపిన పాశమైలారం ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నలుగురు శాస్త్రవేత్తలతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. CSIR శాస్త్రవేత్త వెంకటేశ్వర రావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. సభ్యులుగా ప్రతాప్ కుమార్, సూర్యానారాయణ, పూణెకు చెందిన భద్రతా అధికారి సంతోశ్ ఘుగే ఉన్నారు. కమిటీని నియమిస్తూ ఈ మేరకు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రమాదానికి దారి తీసిన కారణాలు గుర్తించడం, పరిశ్రమల్లో కార్మికుల భద్రత, యాజమాన్యాలు అనుసరించాల్సిన నిబంధనలు.. తదితర అంశాలను గుర్తించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. నెల రోజుల్లో నిర్దిష్టమైన సూచనలు, సిఫార్సులు చేయాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు ఈ ఘటనపై సిగాచి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమృత్ రాజ్ సింహ స్పందించారు. ఈ ఘటనపై సంస్థ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోందన్నారు. ఈ ప్రమాదంలో 38 మంది కార్మికులు మృతి చెందగా, 33 మందికి గాయాలయ్యాని అన్నారు. గాయపడినవారికి పూర్తి వైద్య సదుపాయాలను అందిస్తున్నామని.. వైద్య ఖర్చులన్నీ కంపెనీ భరిస్తుందని తెలిపారు.

Telangana Forms Expert Committee to Probe Sigachi Industries Blast in Pashamylaram

ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం కాకుండా అన్ని రకాల బీమా క్లెయిమ్‌ లను సత్వరమే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని అమృత్ రాజ్ సింహ తెలిపారు. హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు కంపెనీ ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరై అన్ని అవసరాలను చూసుకుంటామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+