Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

All the Best:సెయిలింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ నుంచి హైదరబాద్ అమ్మాయి వైష్ణవి

హైదరాబాదు: ఒమన్‌లో డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సీనియర్ వరల్డ్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన వైష్ణవి వీరవంశం, చెన్నైకు చెందిన నేత్ర కుమనన్ దేశం తరుపున పాల్గొంటున్నారు. ఈ సెయిలింగ్ ప్రపంచ ఛాంపిషన్‌షిప్‌కు వేదికగా ముసన్నా బే నిలిచింది. వైష్ణవికి 15 ఏళ్లు ఉండగా ఈ పోటీల్లో పాల్గొనే అత్యంత పిన్న వయస్కురాలు ఈమె కావడం విశేషం. ఇక ఈ పోటీల్లో పాల్గొనేవారి సగటు వయసు 25గా ఉంది.

హైదరాబాదు బాంబే నేషనల్స్‌తో ప్రతిభ చూపడంతో సెలెక్టర్లు వైష్ణవిపై దృష్టి సారించారు. జాతీయ స్థాయి ర్యాంకింగులో వైష్ణవి రెండవ ర్యాంకు పొందింది. దీంతో సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఈమెను ఎంపిక చేసింది ఫెడరేషన్. "సెయిలింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు తను ఎంపికవ్వడం, భారత్ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు అవకాశం దొరకడం పట్ల చాలా సంతోషంగా ఉంది. లేజర్ రేడియల్ బోట్‌పై కేవలం 6 నెలలు మాత్రమే అనుభవం ఉంది. నా జీవితంలో ఇదొక పెను సవాల్ లాంటిది. ఈ అనుభవం నాకు ఎంతో నేర్పిస్తుంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి తీర్చి దిద్దిన నా కోచ్ మరియు మెంటార్ సుహేమ్ షేక్‌కు రుణపడి ఉంటాను" అని వైష్ణవి వెల్లడించింది. అక్కడి వాతావరణంకు అలవాటు పడేందుకు ఇప్పటికే వైష్ణవి ఒమన్‌కు చేరుకుంది.

Telangana girl sailors Vaishnavi Veeravamsham to represent India at World Championships

ఆగష్టులో హైదరాబాదులో జరిగిన సెయిలింగ్ పోటీల్లో మూడు ట్రోఫీలను కైవసం చేసుకుని సెయిలింగ్ కమ్యూనిటీ మన్ననలు పొందింది.ఆ తర్వాత ముంబైలో జరిగిన జాతీయ సెయిలింగ్‌లో కాంస్య పతకం సాధించింది. వెంట్రుకవాసిలో సిల్వర్ మెడల్ చేజార్చుకుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న నేత్ర కుమనన్ కూడా ఈ పోటీల్లో పాల్గొంటోంది. కచ్చితంగా పతకం సాధిస్తుందనే అంచనాలు నేత్రపై ఉన్నాయి. దాదాపు 30 దేశాల నుంచి పోటీదారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఒలింపిక్స్ తర్వాత నేత్రకు ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. ఈ మధ్యే స్పెయిన్‌లో జరిగిన సెయిలింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుంది.

వైష్ణవి పతకం సాధిస్తుందనే అంచనాలు మాత్రం పెట్టుకోవద్దని, అయితే ఆమెకున్న టాలెంట్ చూశాక కచ్చితంగా అంతర్జాతీయ వేదికలపై అవకాశాలు ఇవ్వాలన్న భావన కలిగిందని అన్నారు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సుహేమ్ షేక్. ఇక ఈ అనుభవం వైష్ణవికి సామర్థ్యానికి పనికొస్తుందని చెప్పారు. ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణ నుంచి నేషనల్ ఛాంపియన్ రవళి పరాంది మరియు ఝాన్సీ ప్రియలు పాల్గొన్నారు. వీరిలో రవళి 9వ స్థానంతో సరిపెట్టుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+