వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jobs: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. రాష్ట్రంలో ఇక ఉద్యోగాల జాతరే..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 9 వైద్య కళాశాలల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 3,897 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులకు పోస్టులు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 17వేలకుపైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ శాఖలో మరో 2వేల పోస్టులు భర్తీ చేస్తామని హరీశ్ రావు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశం ఉంది.

433 పోస్టులు

433 పోస్టులు

ఒక్కో కళాశాలకు 433 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్‌ జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో పోస్టులు భర్తీ చేస్తారు. ఐదు రోజుల క్రితమే 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మరో 16, 940 ఉద్యోగాలకు మూడు రోజుల్లో అనుమతి ఇవ్వనున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, భర్తీలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 60 వేల 929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని సోమేశ్ కుమార్ తెలిపారు.

60వేల 929 పోస్టుల భర్తీ..!

60వేల 929 పోస్టుల భర్తీ..!


సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60వేల 929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ గుర్తు చేశారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతో పాటు, రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీకి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్నారు.

విద్యాశాఖ

విద్యాశాఖ


కొద్ది రోజుల క్రితం రాష్ట్ర పాఠశాఖ విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్-1 పోస్టులు, డైట్‌లో 23 సీనియర్‌ లెక్చరర్ల పోస్టులు, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టులు, డైట్‌లో 65 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుందని అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచారు.

English summary
The state government has given good news to the unemployed. The government has approved the recruitment of jobs in 9 medical colleges of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X