కొత్త రేషన్ కార్డుల జారీ పై తాజా నిర్ణయం - ఇక వీరికే..!!
రేవంత్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ పై కసరత్తు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు వేచి చూస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కొత్త రేషన్ కార్డుల పైన రేవంత్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇక..కొత్తగా పోర్టల్ ప్రారంభించి కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.న
కొత్త కార్డుల మంజూరు
ముఖ్యమంత్రి రేవంత్ తాజాగా ఢిల్లీ పర్యటనలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 55 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీచేసినవి. రాష్ట్ర ప్రభుత్వ కార్డులు 35 లక్షలు. కొత్త కార్డుల కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే.. మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీగా దరఖాస్తులు
రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చాయి. కానీ 'మీ-సేవ'లో పోర్టల్ మాత్రం ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 'మీ-సేవ' పోర్టల్ ఓపెన్ చేసి, కొత్తగా దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉండగా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవటానికి కూడా దరఖాస్తులు వస్తున్నాయి. అంటే.. ఒక కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటే.. భార్యాభర్తల పేర్లు కార్డులో ఉండి పిల్లల పేర్లు లేకపోయినా, ఇద్దరు పిల్లల్లో ఒకరి పేరే ఉన్నా.. కొత్త సభ్యుల చేర్పులు, మార్పుల కోసం ఫ్రొఫార్మాలో తీసుకోవాలని నిర్ణయించారు.
విధి విధానాలపై కసరత్తు
మీ-సేవలో మెంబర్ అడిషన్ పోర్టల్ ఓపెన్ చేసి ఉంది. దాంట్లో ఇప్పటివరకూ 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే.. మెంబర్ అడిషన్‌పై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ రెండు ప్రక్రియలూ పూర్తిచేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపుగా కొలిక్కివచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పని చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. దీంతో, రేషన్ కార్డు పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న వేళ..విధి విధానాల ఖరారు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications