వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నవంబర్ 28వ, తేదిన హైద్రాబాద్‌లో జరిగే జీఈఎస్ 2017 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోచంపల్లి పట్టు చీరను బహుమతిగా ఇవ్వనుంది. అదే విధంగా డైమండ్ నెక్లెస్‌ను కూడ ఇవాంకా ట్రంప్‌కు అందించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇవాంకాకు షాక్: అందుకే బేగంపేటకు, మూడు మైన్ ప్రూప్ వాహనాలుఇవాంకాకు షాక్: అందుకే బేగంపేటకు, మూడు మైన్ ప్రూప్ వాహనాలు

ఈ నెల 28వ, తేదిన హైద్రాబాద్ వేదికగా జీఈఎస్ 2017 సదస్సు జరుగుతోంది.ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు 1600 మంది ప్రతినిధులు హజరు కానున్నారు.

ఇవాంకా టూర్: రంగంలోకి 'జేమ్స్‌బాండ్‌‌లు', మహిళా ఐపిఎస్ అధికారి రక్షణఇవాంకా టూర్: రంగంలోకి 'జేమ్స్‌బాండ్‌‌లు', మహిళా ఐపిఎస్ అధికారి రక్షణ

ఈ సదస్సును ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇవాంకా ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని హైద్రాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం అమెరికా సెక్యూరిటీ అధికారులు నిఘాను ఏర్పాటు చేశారు.

ఇవాంకాకు పోచంపల్లి పట్టు చీరెలు

ఇవాంకాకు పోచంపల్లి పట్టు చీరెలు

హైదరాబాద్‌లో ఈ నెల 28న జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు పోచంపల్లి పట్టుచీరలు, డైమండ్‌ నెక్లెస్‌ బహూకరించనున్నట్టు సమాచారం.సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు కూడా పోచంపల్లి వస్త్రాలు బహూకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

మోడీకి కుర్తా, పైజామా

మోడీకి కుర్తా, పైజామా

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చేనేత కుర్తా, పైజామాను తెలంగాణ ప్రభుత్వం బహుమానంగా ఇవ్వనున్నట్లు సమాచారం. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి, ప్రాచుర్యం వస్తుందని సర్కారు భావిస్తోంది. మూడు రోజులపాటు జరిగే సదస్సులో పాల్గొనే 200 మంది మహిళా వలంటీర్లు పోచంపల్లి కాటన్‌ ,ఇతర చేనేత చీరలు ధరించనున్నారు. ఇందుకోసం పోచంపల్లిలో 200 ‘టెస్కో'రకం పట్టుచీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు.

 జీఈఎస్ డెలిగేట్స్‌కు తేనీటి విందు

జీఈఎస్ డెలిగేట్స్‌కు తేనీటి విందు

జీఈఎస్‌ సదస్సుకు వచ్చే అతిథులకు అమెరికా ప్రభుత్వం తరఫున స్థానిక యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులు తేనేటి విందు ఇవ్వనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం నోవాటెల్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అమెరికా గురించి ప్రజెంటేషన్‌ కూడా ఉండనుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఈ నెల 28న చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, 29న రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటలో విందు ఇస్తారు.

పాతబస్తీలో అధికారుల తనిఖీలు

పాతబస్తీలో అధికారుల తనిఖీలు

పాతబస్తీలో అమెరికా సెక్యూరిటీ అధికారులు, తెలంగాణ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చార్మినార్‌ను ఇవాంకా ట్రంప్ సందర్శించనున్నారు. అంతేకాదు పాతబస్తీలో గాజులకు ప్రసిద్ది. అయితే ఇవాంకాకు గాజుల దుకాణంలో గాజులను పరిశీలించే అవకాశం ఉంది. గాజుల తయారీ కోసం ఉపయోగించే పదార్ధాలు ఎక్కడి నుండి ఈ పదార్ధాలను తీసుకువస్తారనే విషయాలపై కూడ ఆరా తీశారు.

English summary
Telangana government to gift Ivanka Trump pochampally sarees on November 28 at GES 2017 summit. Telangana government made a special handloom dress to Prime minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X