నేటి నుంచి 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ, ఇక రాజధానిగా - కొత్త కమీషనర్లు..!!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్వరూపం మారిపోయింది. నేటి నుంచి మూడు కార్పోరేషన్లుగా గ్రేటర్ కొనసాగనుంది. 300 డివిజన్లకు విస్తరించి మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మూడు కార్పోరేషన్లకు కొత్త కమీషనర్లను నియమించింది. అదే విధంగా ఐఏఎస్ అధికారుల బదిలీల పైన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ భవనాలన్నీ జీహెచ్‌ఎంసీ పరిధికే వచ్చాయి. రాజధాని నగరంగా జీహెచ్‌ఎంసీనే కొనసాగనుంది.
నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పోరేషన్లుగా కొత్త రూపం సంతరించుకుంది. దీంతో, ఇక నుంచి జీహెచ్ఎంసీతో పాటూ సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లు గా రూపాంతరం చెందాయి. 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు.

అయితే.. గ్రేటర్ కాల పరిమితి పూర్తి కావటంతో మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించారు. కొత్త పాలకమండలి వచ్చే వరకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్ కొనసాగనున్నారు. అదే విధంగా మల్కాజ్‌గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ ను నియమించారు. హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం.సంతోష్, లోక్‌భవన్ జాయింట్ సెక్రటరీగా కె.కిరణాచారి నియమితులయ్యారు.
కమీషనర్లు..ఐఏఎస్ ల బదిలీలు
హైదరాబాద్ మొత్తం డివిజన్ల సంఖ్య 300కు చేరింది. 60 సర్కిళ్లు, 12 జోన్లతో పరిపాలన వ్యవస్థ ఉండనుంది. ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు కూడా పూర్తైంది. దీంతో ప్రభుత్వం మూడు కార్పొరేషన్ల ఏర్పాటు పూర్తి చేసింది. ఇదే సమయంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ కొనసాగనున్నారు.
TGRAC డీజీగా సందీప్‌కుమార్ సుల్తానియా .. పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్య దేవరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా కాత్యాయనీ దేవిని నియమించింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ JMDగా కాత్యాయనికి అదనపు బాధ్యతలు కేటాయించింది. HMWSSB జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్, ఇండస్ట్రీస్ & కామర్స్ స్పెషల్ సీఎస్‌గా రఘురాంశర్మలకు బాధ్యతలను అప్పగించింది. అలాగే, మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో రఘురాంశర్మ కొనసాగనున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications