హైదరాబాద్ నడిబొడ్డున చెంగిచియాన్..!!

తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించేందుకు నడుం బిగించింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా ఇప్పటికే పలు దేశాలలో ముఖ్యమంత్రి రేవంత్‌‌తో సహా పలువురు మంత్రులు ఇతర ప్రభుత్వ అధికారుల బృందాలు పర్యటించాయి. అక్కడ నదులను, చెరువులను పరిశీలించారు. అక్కడ వినియోగించే టెక్నాలజీతో తెలంగాణలోని పలు నదులను, సరస్సులను శుద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత,ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగా రెడ్డి, కాలే యాదయ్య, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్,GHMC , మూసి రివర్ ప్రంట్ అధికారులు, తదితరులతో వెళ్లిన బృందం సియోల్ నగరం చేరుకుంది.

Telangana government visits south korea to study Cheonggyecheon river

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడుసీయోల్ లోని

చెంగిచియాన్ నది సందర్శన,రివర్ ఫ్రంట్ అధికారులతో చర్చలు,చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించారు. పర్యావరణం పై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగం లోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఉంది. మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుండి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించబోతుంది సియోల్ నగర పాలక్ సంస్థ.

ఇటువంటివి నగరం లో నాలుగు ప్లాంట్లను నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విధానాలను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అవకాశం పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య అధికారుల బృందం పరిశీలించారు.

Telangana government visits south korea to study Cheonggyecheon river

హైదరాబాద్ కూడా సియోల్ నగరంలా..

"గతంలో సియోల్ నగరం నడిబొడ్డు నుండి ప్రవహించే చెంగిచియాన్ నది కూడా మన హైదరాబాద్ నుండి ప్రవహించే మూసి నది లాగానే మురికిమయంగా ఉండేది. సియోల్ నగర పాలక సంస్థ ముందుకు వచ్చి ఈ నదిని ప్రక్షాళన చేసి పునరుజీవం పోశారు. నేడు అత్యంత సుందరమైన నగరంగా సియోల్ మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్, తెలంగాణ ప్రజల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మూసి నది ప్రక్షాళన చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూసి నదికి పునర్జీవం పోస్తే హైదరాబాద్ మహానగరం కూడా సియోల్ నగరం గా అందంగా తయారవుతుంది అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+