బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసారు. రిజర్వేషన్ల కోసం తాజాగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో, తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గజెట్ జారీ కానుంది. ఇక, రిజర్వేషన్ల అంశం తేలటంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఇటు ప్రభుత్వం జీవోలు సైతం జారీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అనేక వ్యూహాలు చేసింది. తాజాగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు రేవంత్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ గా కనిపిస్తోంది. దీని ఆమోదం ద్వారా ఇక.. తాజా రిజర్వేషన్ల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభం కానుంది.

కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ హైకోర్టు గడువుగా నిర్ణయించింది. జూలై చివరి నాటికి రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 30 నాటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలో మార్చి నెలలో నిర్వహించిన కుల గణన ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించింది.
రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. అయితే, రాష్ట్రం చేసిన అభ్యర్థనకు కేంద్రం ఇంకా స్పందించకపోవడంతో, పెరిగిన బీసీ కోటాతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు.. ఇప్పుడు గవర్నర్ అనుమతి పొందింది.












Click it and Unblock the Notifications