రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, డీజీపీ స్వాగతం పలికారు. కాగా, చాలా కాలం తర్వాత గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. వీరిరువువు అప్యాయంగా పలకరించుకున్నారు.

కాగా, శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. శనివారం ఉదయం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యూయేషన్ పరేడ్‌కు రాష్ట్రపతి హాజరుకానున్నారు. శనివారం ఉదయం బేగంపేట నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి చేరుకుంటారు.

 CM KCR

ప్రి కమిషన్డ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఎయిర్‌ఫోర్స్ చెందిన పలు విభాగాల క్యాడెట్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఈ గ్రాడ్యూయేషన్ సెర్మనీకి ఆమె ఆమె రివ్యూయింగ్ అధికారిగా ఉండనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు పట్టాలు అందించడంతోపాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పతకాలు బహూకరించనున్నారు. ఇందులో భాగంగా క్యాడెట్లకు శిక్షణ ఇచ్చిన పలు ఎయిర్ క్ట్రాఫ్‌లను ఆమె తిలకించనున్నారు.

పలు కార్యక్రమాలను కూడా ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఉదయం 11.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యనట దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి బస దృష్ట్యా పరిసర ప్రాంతాల్లోనూ బలగాలు మోహరించారు.

రాష్ట్రపతి ముర్ము పర్యటన నేపథ్యంలో నగరంలోని ఆయా మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. అమీర్‌పేట నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్ వైపు వచ్చే వాహనాలు ప్రకాశ్ నగర్ టీ జంక్షన్ వద్ద నిలిపివేయనున్నట్లు తెలిపారు. బాలానగర్ నుంచి వచ్చే వాహనదారులు ఫతేనగర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌, బాల్కంపేట్, మైత్రీవనం మీదుగా వెళ్లాలని సూచించారు. వాహనదారులు పై ఆంక్షలను గుర్తించి పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+