వీహెచ్‌ కు సీఎం రేవంత్ కీలక పదవి, శివధర్ రెడ్డికి కొత్త బాధ్యతలు...!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు కు కొత్త పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న వీహెచ్.. రేవంత్ బాధ్యతల స్వీకరణ నాటి నుంచి మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో ఈ రోజు డీజీపీగా పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డికి కొత్త బాధ్యతలు కేటాయించారు. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులు అయ్యారు. ఈ ఇద్దరి పదవుల ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తి కర నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావుకు కూడా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించారు. హనుమంతరావును బీసీ సంక్షేమం, అభివృద్ధి విభాగాలకు ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అదే విధంగా రాష్ట్ర డీజీపీగా సేవలు పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి బత్తుల శివధర్ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శివధర్ రెడ్డి ఈ రోజు పదవీ విరమణ అనంతరం ఆయనకు మరో కీలక బాధ్యత అప్పగించారు. రాష్ట్ర భద్రతా సలహా దారు గా ఆయన మూడేళ్ల కాలానికి సేవలందించనున్నారు. శివధర్ రెడ్డి కొత్త బాధ్యతల్లో పోలీస్ వ్యవహారాలు, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

విజయ్ ఊహించని నిర్ణయం, ఎగ్జిట్ పోల్స్ తో కొత్త రాజకీయం- ముందస్తు ఒప్పందం..!!
విజయ్ ఊహించని నిర్ణయం, ఎగ్జిట్ పోల్స్ తో కొత్త రాజకీయం- ముందస్తు ఒప్పందం..!!
telangana-govt-appoints-v-hanumantha-rao-ips-shivadhar-reddy-as-advisors-for-govt-orders-issued

శివధర్ రెడ్డికి కొత్త బాధ్యతలు

తన పదవీ విరమణ వేళ శివధర్ రెడ్డికి పోలీసులు గౌరవ వీడ్కోలు పలికారు. ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. 32 ఏళ్ల పోలీస్ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. 1970, 1980లో పోలీసుల పరిస్థితులు వేరని.. ఇప్పుడు పని చేస్తున్న పోలీస్ సిబ్బంది పరిస్థితులు వేరన్నారు. గతం కంటే ఇప్పుడున్న పోలీసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. పోలీస్ విభాగం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుత సిటిజన్స్‌కు ఫ్రెండ్లీ పోలీసింగ్ అవసరమన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిపించామని తెలిపారు. భవిష్యత్తుకు అనుగుణంగా పోలీస్ శాఖను సిద్ధం చేశామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+