విదేశాల్లో విద్యకు ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ - దరఖాస్తులు, అర్హతలు..!!

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే వారికి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసారు.

విదేశాల్లో విద్యనందించే తెలంగాణ ప్రభుత్వ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ద్వారా విద్యార్ధులకు మరో అవకాశం కల్పించారు. ఈ పథకం కింద స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యా ర్థులకు 20 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం అంద జే స్తుంది. దీంతోపాటు విమాన, వీసా ఖర్చులను భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూఎస్‌ఏ, కెనడా, జర్మనీ, యూకే, సింగపూర్‌, జపాన్‌, ఆస్ర్టేలియాతో పాటు ఇతర దేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఇందు కోసం సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తులను తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

 సికింద్రాబాద్ నుంచి అయోధ్య, హరిద్వార్ కు కొత్త రైళ్లు ఖరారు- రూట్, ముహూర్తం..!!
సికింద్రాబాద్ నుంచి అయోధ్య, హరిద్వార్ కు కొత్త రైళ్లు ఖరారు- రూట్, ముహూర్తం..!!
telangana-govt-big-decision-for-bc-ebc-students-seeking-overseas-education-applications-invited

దరఖాస్తులు..అర్హతలు

ఈ పథకం ద్వారా విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థులకు అవకాశం లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 35 సంవత్సరాల్లోపు ఉండాలని స్పష్టం చేసింది. కాగా.. విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. GRE/GMAT స్కోర్‌తో పాటు TOEFL/IELTS/PTEలో అవసరమైన స్కోర్ సాధించి ఉండాలి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యం ఉన్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+