ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, వారికి కేటాయింపు - పంపిణీ ముహూర్తం..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పై లబ్దిదారులకు తీపి కబురు అందించింది. పంపిణీ ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు. పేదలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కొత్త ఇళ్ల మంజూరు విషయంలో అర్హులకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 15వ తేదీ లోగా వారందరికీ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. వారికి ఉచితంగా ఇంటి స్థలం కూడా మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించారు. పేదలు ఎవరూ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ నెల 15వ తేదీలోపు అర్హులైనవారికి ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేయడంకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం తమ ప్రభుత్వంలో జరగదని భరోసా కల్పించారు. ఇళ్లను కోల్పోయిన పేదలను గుర్తించేందుకు సామాజిక, ఆర్ధిక సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని ఆయన తెలిపారు. అక్కడ మౌలిక వసతులు కల్పించడంతో పాటు అంగన్ వాడీ, ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ
ఇదే సమయంలో విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు. కొందరు మాజీ మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ప్రతిపక్షాలు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. భూదాన్ భూము ల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు నివాసయోగ్యమైన స్థలం కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. పేదల దీనెనతో ఏర్పడిన ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం చేయమన్నారు. ఇల్లు కూల్చివేత విషయంలో ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ఖమ్మంలోని వెలుగుమట్ల వినోబాభావే భూదాన్ భూముల్లో ఇటీవల ఇళ్లను కూల్చివేశారు. ఈ భూముల్లో ఎనిమిదేళ్ల క్రితం నుంచి 720 కుటుంబాలు ఇళ్లను నిర్మించుకుని ఉంటున్నాయని..వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారన్నారు. ఇక హైదరాబాద్‌లో ఉన్న పేదలకు ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇప్పటికే లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ పూర్తయింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications