పారా మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా: తెలంగాణలో కొత్తగా 20 కేజీబీవీలు, ఎక్కడెక్కడంటే?
హైదరాబాద్: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఈ కోటా ద్వారా 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు.
బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెల్సీ, నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయనుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో కొత్తగా మరో 20 కేజీబీవీలు: ఉతర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేద బాలికలను అక్కున చేర్చుకుని.. మంచి చదువు అందించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)ను రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటుకానున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా మరో 20 కేజీబీవీలు మంజూరయ్యాయి. వీటిని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ మంగళవారం జీవో నెంబర్-24ను విడుదల చేసింది. వీటిని ఏర్పాటుకు గాను రికరింగ్ బడ్జెట్‌గా రూ. 60 లక్షలను కూడా మంజూరుచేసింది.
జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రభుత్వం పలు మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా కొత్త మండలాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలా 20 కేజీబీవీలను నెలకొల్పాల్సి ఉండగా.. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో రాష్ట్రంలో కేవలం 391 కేజీబీవీలు ఉండగా.. 2017-18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరుచేశారు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కి చేరింది. తాజాగా మరో 20 కేజీబీవీలు మంజూరు చేయడంతో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్, మరో 230 కేజీబీవీలను పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు.
కొత్తగా కేజీబీవీలను మావల (ఆదిలాబాద్), బీర్‌పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్‌పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్‌పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్‌లలో ఏర్పాటు చేయనున్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications