RTC- Metro కామన్ పాస్ ధరల భారీగా తగ్గింపు - కొత్త రేట్లు ఇలా..!?
ఆర్టీసీ -మెట్రో పాస్ ల ధరల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయనే ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘ కసరత్తు తరువాత ఛార్జీల తగ్గింపు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించారు. అధికారిక ఆమోదం తరువాత ప్రకటన చేయనున్నారు.
ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రభుత్వం ఎట్టకేలకు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన కామన్ పాస్ ధరలు రోజువారీ పాస్‌కు రూ.400 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంది. అదేవిధంగా నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500గా నిర్ణయించారు. అయితే ఈ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పున సమీక్ష చేసిన ప్రభుత్వం ఈ ధరలను సగం వరకు తగ్గిస్తూ ప్రతిపాదనలు సిద్దం చేసింది.

ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు
తాజాగా చేసిన కసరత్తు మేరకు కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ ధరను రూ. 4,000 లేదా రూ. 4,500కు తగ్గించనున్నారు. రూ. 4,000గా నిర్ణయిస్తే ఇందులో ఆర్టీసీకి రూ. 1,000, మెట్రో యాజమాన్యానికి రూ. 3,000 లేదా రూ. 3,500 వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా ఒకే రోజులో మల్టిపుల్ రూట్లలో ప్రయాణించే వారి కోసం అందుబాటులో ఉన్న డైలీ పాస్ ధరను కూడా తగ్గించారు. పాత ధర రూ. 400 ఉండగా కొత్త ధర ప్రకారం రూ. 325 చేశారు. ఆర్టీసీ ఖాతాలోకి రూ. 75, మెట్రో రైలు యాజమాన్యానికి రూ. 250 చొప్పున వెళ్తాయి. దీనితో రోజంతా మెట్రో, ఆర్టీసీలో హైదరాబాద్ పరిధిలో ఎక్కడికైనా వెళ్లవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ తాజా ప్రతిపాదనల పైన ఆమోదం ఇవ్వగానే దీపావళి నుంచే కొత్త ధరలు అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది.













Click it and Unblock the Notifications
