పెద్ద ఎత్తున పరిశ్రమలు, 10లక్షల కోట్లు టార్గెట్: కెటిఆర్, నివేదిక(పిక్చర్స్)
హైదరాబాద్: టిఎస్‌ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఏడాదిలో పరిశ్రమల శాఖ సాధించిన అభివృద్ధిని శనివారం మీడియా సమావేశంలో కెటిఆర్ వెల్లడించారు.
ఇప్పటి వరకు 2313 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, వీటి వల్ల 38,727 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, లక్షా 20 వేల 869 మందికి ఉపాధి లభించినట్టు చెప్పారు. పరిశ్రమలు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
టిఎస్‌ఐపాస్ ద్వారా ఏడవ విడతగా పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందజేశారు. నిర్మాణ రంగంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఇసుకకు బదులు రాక్‌శాండ్‌తో నిర్మాణాలు చేపట్టేందుకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావాలని సూచించారు.
10లక్షల కోట్లు టార్గెట్
రాష్ట్రంలో పెట్టుబడులను విస్తృతం చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఇక్కడికి అకర్షించడానికి వచ్చే సంవత్సరం ప్రారంభంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.
రూ. 10లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో కొత్తగా మెడికల్ డివైస్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, సీడ్ పార్క్ తీసుకరావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

నివేదిక విడుదల చేస్తున్న కెటిఆర్
టిఎస్‌ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు.

మంత్రి కెటిఆర్
ఏడాదిలో పరిశ్రమల శాఖ సాధించిన అభివృద్ధిని శనివారం మీడియా సమావేశంలో కెటిఆర్ వెల్లడించారు.

మంత్రి కెటిఆర్
ఇప్పటి వరకు 2313 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, వీటి వల్ల 38,727 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, లక్షా 20 వేల 869 మందికి ఉపాధి లభించినట్టు చెప్పారు.

మంత్రి కెటిఆర్
పరిశ్రమలు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

మంత్రి కెటిఆర్
టిఎస్‌ఐపాస్ ద్వారా ఏడవ విడతగా పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందజేశారు. నిర్మాణ రంగంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఇసుకకు బదులు రాక్‌శాండ్‌తో నిర్మాణాలు చేపట్టేందుకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావాలని సూచించారు.

మంత్రి కెటిఆర్
తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అభినందిస్తున్నారని తెలిపారు. అనేక దేశాలకు చెందిన పరిశ్రమల వారు తమ పారిశ్రామిక విధానం గురించి అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. సులభతరంగా పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయని, పారదర్శకంగా విధానాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.

మంత్రి కెటిఆర్
ఉపాధి కల్పనా అవకాశాలు పెంచేలా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు తెలిపారు. 2015-16లో మైనింగ్ శాఖలో 2,772 కోట్ల రూపాయలు గడించినట్టు చెప్పారు.

మంత్రి కెటిఆర్
2016-17లో నాలుగువేల కోట్ల ఆదాయం గడించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. టిఎస్‌ఐపాస్ ద్వారానే ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పెస్ యూనిట్‌కు అనుమతి ఇచ్చామన్నారు.

మంత్రి కెటిఆర్
ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ కంపెనీలు పెద్దఎత్తున రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరం తరువాత వరంగల్‌పై ఐటి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఐటి కంపెనీలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు తెలంగాణలో మంచి అవకాశం ఉందని, రక్షణ రంగం ఉత్పత్తులకు కేంద్రం కాబోతుందని తెలిపారు.

మంత్రి కెటిఆర్
పరిశ్రమలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు తీసుకోవడం వల్ల మంచి స్పందన కనిపిస్తోందని చెప్పారు. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశం అని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించినట్టు కెటిఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications