వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా రహిత గ్రామాలే లక్ష్యంగా తెలంగాణా సర్కార్ సర్వే.. ఇంటింటికీ జ్వరపరీక్షలు చేసి వివరాల సేకరణ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . కరోనా రహిత గ్రామాలే లక్ష్యంగా తెలంగాణా సర్కార్ సర్వే చేపట్టి ఇంటింటికీ జ్వరపరీక్షలు చేసి అనారోగ్యంతో ఉన్న వారి వివరాలను సేకరించనుంది . ఈ క్రమంలో ఏ ఎన్ ఎంలు, ఆశా వ‌ర్క‌ర్ల సాయంతో ఇంటింటి సర్వే నిర్వహించి జ్వర పరీక్షలు చేసి క‌రోనా ల‌క్షణాలు ఉన్న‌వారిని గుర్తించేందుకు నేటి నుండి సిబ్బందిని రంగంలోకి దించింది .

అనంతపురం పొలాల్లో పీపీఈ కిట్ల కలకలం .. కరోనా భయంతో ఏం చేశారో తెలుసా !!అనంతపురం పొలాల్లో పీపీఈ కిట్ల కలకలం .. కరోనా భయంతో ఏం చేశారో తెలుసా !!

 గ్రామీణ ప్రాంతాలకు కరోనా సోకకుండా ముందే పరీక్షలు

గ్రామీణ ప్రాంతాలకు కరోనా సోకకుండా ముందే పరీక్షలు

నేటి నుండి తెలంగాణా రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో సైతం ఇంటింటి సర్వే కొనసాగనుంది . తెలంగాణా రాష్ట్రంలోని గ్రామాలను కరోనా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇంటింటా జ్వర పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఎన్ని చర్యలు తీసుకున్నా, లాక్ డౌన్ విధించినా పెరుగుతున్న కరోనా మహమ్మారి ప్రభావం గ్రామీణుల దరిచేరకుండా ఉండేందుకు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి ప్రజల్లో వ్యాధి లక్షణాలను ఉంటే గుర్తించే పనిలో పడింది.

43,900 మంది సిబ్బందితో కార్యాచరణ

43,900 మంది సిబ్బందితో కార్యాచరణ

నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఆశా వర్కర్లు , ఏఎన్ఎం లు ఇళ్లకు వెళ్లి జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా లక్షణాలున్న వారి వివరాలను నమోదుచేస్తారు. ఎలాగైతే సీజనల్‌ వ్యాధులు ప్రబలిన సందర్భంలో ప్రతి వ్యకిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై అధికార యంత్రాంగం అంచనాలు రూపొందిస్తుందో ఆ విధంగానే కరోనాను ముందస్తుగా గుర్తించేందుకు ఇంటింటా జ్వర పరీక్షలు నిర్వహించేందుకు వైద్యఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్రంలోని 43,900 మంది సిబ్బందితో కార్యాచరణ మొదలు పెట్టింది.

జాగ్రత్తగా సర్వే చేసి నివేదిక రూపొందించాలని సూచించిన మంత్రి ఈటెల రాజేందర్

జాగ్రత్తగా సర్వే చేసి నివేదిక రూపొందించాలని సూచించిన మంత్రి ఈటెల రాజేందర్

ఇక తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్వే విషయంలో ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు . ఆయా జిల్లాల వైద్య శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సర్వే చేస్తున్నప్పుడు ఎవరికైనా వైరస్‌ లక్షణాలున్నాయేమో జాగ్రత్తగా తెలుసుకోవాలని మంత్రి చెప్పారు. ఇక అంతేకాకుండా ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పొందేందుకు వచ్చే వారి వివరాలను సాధారణ వ్యాధులు, కరోనా సంబంధిత వ్యాధిగ్రస్థులను వేరుగా నమోదు చేయాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమం చాలా జాగ్రత్తగా నిర్వహించాలని అప్పుడే మన రాష్ట్రాన్ని కరోనా బారి నుండి కాపాడుకునే అవకాశం ఉంటుందని మంత్రి ఈటెల పేర్కొన్నారు .

హైదరాబాద్ లో ఆందోళనకరంగా పెరుగుతున్న కేసులు

హైదరాబాద్ లో ఆందోళనకరంగా పెరుగుతున్న కేసులు

తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది. తెలంగాణా సర్కార్ రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని మినహాయింపులు ఇచ్చినా అన్నిటికీ పూర్తిగా సడలింపులు ఇవ్వలేదు .ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసులు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,414 కేసులు నమోదు కాగా, 428 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. ఇక 952కేసులు కరోనా నుండి బయటపడి డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇప్పటివరకు 34 మరణాలు సంభవించాయి. ఇక అన్నిటికంటే ఒక్క హైదరాబాద్ లో 867 కేసులు నమోదు అయ్యాయి అంటే హైదరాబాద్ లో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు . లాక్ డౌన్ ను ఎత్తివేస్తే వ్యాధి ప్రబలకుండా సర్వే చేసి కరోనా కట్టడికి ప్రయత్నిస్తుంది తెలంగాణా సర్కార్ .

English summary
The Telangana government has made a key decision in the wake of the increasing number of coronavirus victims in Telangana. Telangana govt Survey is aimed at villages and conducts fever tests at homes and collects the details of the sick. To this end, a survey of households with the help of ANMs and Asha workers has put 43,900 personnel in the field.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X