పోలీసు శాఖలో సీఎం కేసీఆర్ మార్క్ ప్రక్షాళన - అర్ద్రరాత్రి కీలక ఉత్తర్వులు..!!

తెలంగాణ ఎన్నికల వేళ పోలీసు శాఖలో భారీ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. ముందుగా పోలీసు శాఖలో అనూహ్య మార్పులు చేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే సారి 91 మంది అధికారులను బదిలీ చేసారు. అందులో 51 మంది ఐపీఎస్ లు ఉండగా.. 41 మంది నాన్ కేడర్ అధికారులు ఉన్నారు.

సీఎస్ శాంతి కుమార్.. డీజీపీ అంజనీ కుమార్ తో సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం కేసీఆర్ అర్ద్రరాత్రి పోలీసు అధికారుల బదిలీలకు ఆమోద ముద్ర వేసారు. మొత్తం 91 మంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అర్ద్రరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల వేళ భారీ బదిలీలు..

ఎన్నికల వేళ భారీ బదిలీలు..

తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముందుగానే సుదీర్ఘ కాలం ఒకే చోట పని చేస్తున్న ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒక విధంగా ఒక సారి 91 మంది అధికారులకు స్థాన చలనం నిర్ణయం ద్వారా మొత్తంగా పోలీసు శాఖ ప్రక్షాళన చేసింది. ఈ నెల 3వ తేదీన 29 మంది ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు ఒకే సారి 91 మంది పైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్..రాచకొండ..సైబరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కీలక అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజీపీగా అంజనీ కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుల వ్యవధిలోనే రెండు దఫాల్లో వంద మందికి పైగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

కీలక అధికారులకు స్థానచలనం

కీలక అధికారులకు స్థానచలనం


మూడేళ్లు ఓకే చోట పని చేసిన అంశం ప్రామాణికంగా తీసుకొని బదిలీలు చేసినట్లు స్పష్టం అవుతోంది. అందులో ప్రధానంగా రాచకొండ జాయింట్‌ సీపీగా సత్యనారాయణ, రామగుండం సీపీగా రెమా రాజేశ్వరి, రాచకొండ ట్రాఫిక్‌కు అభిషేక్‌ మహంతి, ఇంటెలిజెన్స్‌కు విజయ్‌కుమార్‌, ఏసీబీ జేడీగా చేతన మైలాబత్తుల, సైబర్‌ సెక్యూరిటీకి విశ్వజిత్‌ కాంపాటి, రఘువీర్‌, నార్కోటిక్స్‌కు సునీత, గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా, మహబూబ్‌నగర్‌, గద్వాల, జగిత్యాల ఎస్పీలుగా నాన్‌ కేడర్‌ అధికారులు నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న పలువురికీ పోస్టింగ్‌ ఇచ్చారు.

ఎన్నికల ఏడాదిలో కీలకంగా

ఎన్నికల ఏడాదిలో కీలకంగా


ఇప్పుడు చేసిన బదిలీలు..పోస్టింగ్ ల ద్వారా రానున్న ఎన్నికల విధులు ఇదే అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. కొంత కాలంగా పోలీసు శాఖలో బదిలీలు ఉంటాయని అందరూ భావించారు అయితే, అనూహ్యంగా ఇంత పెద్ద మొత్తంలో మార్పులు చేయటం..అదే సమయంలో దాదాపు ప్రతీ జిల్లాలోనూ అధికారుల మార్పు జరిగింది.

ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ..ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుగా అధికార యంత్రాంగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ పూర్తి చేసింది. ఐఏఎస్ అధికారుల బదిలీ వ్యవహారం పైన ప్రభుత్వం వర్గాల్లో చర్చ జరుగుతోంద.ి ఐఏఎస్ బదిలీలు కూడా త్వరలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. ముందే ఐఏఎస్ అధికారుల బదిలీలు పూర్తి చేస్తారా.. తరువాత నిర్ణయం తీసుకుంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+