చేనేత కార్మికులకు రుణమాఫీ: ఆప్కో ఛైర్మన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే చేనేత కార్మికుల రుణాలను తెలంగాణ ప్రభుత్వం కూడా మాఫీ చేయాలని ఆప్కో ఛైర్మన్, మాజీ మంత్రి మరుగుడు హనుమంతురావు కోరారు. తెలుగు రాష్ట్రాల పరంగా ఎపీలో చేనేత రుణాలను పూర్తిగా మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినందున తెలంగాణలోని చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం అక్కడ కుడా రుణాలను మాఫీ చేయాలన్నారు.

తెలంగాణలో చేనేత శాఖకు ప్రత్యేకంగా మంత్రి కూడా లేరని, ఆ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున తక్షణమే రుణమాఫీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నామని హనుమంతురావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, విభజన చట్టంలోని అంశాల మేరకు ఆప్కో విభజన చేపడుతున్నామని, ఆడిటింగ్ పరంగా ఉన్న ఇబ్బందులను పరిష్కరించే క్రమంలో జాప్యం అనివార్యంగా మారుతుందని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి ఆప్కోను రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఆపెక్స్ సంస్దలుగా చూపుతామన్నారు.

ఆప్కో పరిధిలోని హ్యాండ్ లూమ్ హౌస్‌లను మెగా షోరూమ్స్ గా మర్చవలసిని అవసరం ఉందని, ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేసిన ఆప్కో మెగా షోరూమ్ కు అనూహ్యా స్పందన వచ్చిందని అన్నారు. అక్కడ సగటున నిత్యం రెండు లక్షల వరకు విక్రయాలు చేయగలుగుతున్నామని, ఈ క్రమంలోనే విశాఖరపట్నం, తిరుపతి, హైదరాబాద్‌ల్లో మెగా షోరూమ్స్ ఏర్పాటుకు పాలక మండలి అందీకరించిదన్నారు.

ఆప్కోకు అత్యధిక విక్రయాలు అందిస్తున్న శ్రీకాకుళం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టిని సారించామన్నారు. అక్కడ మెగా షోరూమ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే క్రమంలో తగిన బృందంతో తాను స్వయంగా పర్యటించనున్నానని వెల్లడించారు.

ఆప్రో వస్త్రాల పట్ల రాష్ట్ర ప్రజలకు విశేష నమ్మకం ఉన్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా విక్రయశాలలు రూపుదిద్దుకోకపోవడం వల్ల వినియోగదారులను ఆకర్షించలేకపోతున్నామని ఈ సమస్యను అధిగమించేలా అన్ని వసతులతో విక్రయశాలలను ఆధునీకరించి, ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా వస్త్ర సేకరణ చేపట్టి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు.

Telangana govt need assures the runa mafi for cheneta karmikulu

ఈ క్రమంలో చేనేత కార్మికులను ఎక్కువ పనిదినాలను అందించగలుగుతామన్నారు. ఇరు ప్రభుత్వాల సహకారంతో నూలు సబ్సిడీగా అందుతున్న ఇరవైశాతంలో పదిశాతం మొత్తాన్ని నేరుగా పారిశ్రామికులకు చేరేలా చర్యలు చేపడుతున్నామని, ఇటీవల జరిగిన ఆప్రో సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

ప్రస్తుతం ఇది సంఘూలకు వెళుతొందని, తాజా మార్పు ఫలితంగా నేరుగా చేనేతలు లభ్ది పొందగలుగుతారన్నారు. ఆప్రో ఎండీ గుర్రం గౌరీ శంకర్ మాట్లాడుతూ విజయవాడ కేంద్రగా ఆప్కో ఈ కామర్స్ డిస్టిబ్యూషన్ పాయింట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకవస్తామని తెలిపారు.

ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ. 50 కోట్ల విలువైన జనరల్ వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆప్కో నిర్ణయించగా, ఇప్పటికే 27.4 కోట్ల విలువైన వస్త్తాలకు ఇండెట్ ఇవ్వటం జరిగిందని, ఇప్పటికే రూ . 21.2 కోట్ల విలువైన వస్త్రాలు ఆప్కో గిడ్డంగులకు చేరాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+