స్కూలు ఫీజులు తగ్గింపు, కొత్త చట్టం - ఏ తరగతికి ఎంత..!!

విద్యార్ధుల పేరెంట్స్ కు బిగ్ రిలీఫ్. భారీ ఫీజులతో సతమతం అవుతున్న తల్లి తండ్రులకు ఉప శమనం కలిగించే నిర్ణయం రానుంది. ఇప్పటికే ప్రయివేటు విద్యా సంస్థల్లో అనేక పేర్లతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటిని తగ్గించాలని పేరెంట్స్ కమిటీలు కోరుతున్నా ప్రయివేటు విద్యా సంస్థలు లెక్క చేయటం లేదు. దీంతో, ప్రభుత్వమే ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు నియంత్రణ కోసం కొత్త చట్టం సిద్దం చేసింది. ఇందుకు ముహూర్తం ఖరారైంది.

ఫీజు నియంత్రణ దిశగా
కొర్పోరేట్ విద్య పేరుతో ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజుల భారం పెరిగిపోయింది. దీని పైన చాలా కాలంగా పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు తమ బ్రాండ్ కు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. లక్షల్లో వసూలు చేస్తున్న ప్రయివేటు యాజమన్యా లను ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక శిక్షణ, ట్యూషన్ ఫీజు, అనేక రకాల కోర్సులకు శిక్షణ పేరుతో ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు. యూపిఫాం, పుస్తకాల విషయంలోనూ విద్యా సంస్థలు తమ నిబంధనల మేరకే నడుచుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పేరెంట్స్ పైన భారీగా భారం పడుతోంది.

RG Govt planning to introduce Fee Regulation act bill in up coming assembly Budget sessions

నిపుణుల సూచనలు
ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ రిలీఫ్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణకు చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొస్తోంది. ఈ మేరకు కసరత్తు కొనసాగుతోంది. ఇప్ప టికే ఫీజుల నియంత్రణపై అధ్యయనం జరిపిన విద్యా కమీషన్.. తెలంగాణ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూల్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లు -2025 పేరుతో ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. కాగా, ఈ బిల్లులో విద్యా శాఖ అధికారులు కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు సమాచారం.

అసెంబ్లీ ముందుకు
వీటితో పాటుగా పేరెంట్స్ అసోసియేషన్ నుంచి సలహాలను ఆహ్వానించి.. వాటిని కూడా విద్యా కమిషన్ కు సమర్పించారు. ప్రభుత్వం గత ఏడాది విద్యారంగ సమస్యల పైన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఫీజుల నియంత్రణ బిల్లు అమల్లోకి తెచ్చిన రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను సబ్ కమిటీ అధ్యయనం చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి ప్రభుత్ వాలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో, పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ చట్టం అమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+