Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి తాజాగా శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్టు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా, ఈ కొత్త షాపుల ఏర్పాటుతో రేషన్ సరుకుల పంపిణీ మరింత వేగవంతం అవుతుందని, లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఏప్రిల్ లో మూడు నెలల రేషన్ కోటా పంపిణీ

ఇదిలా ఉంటే ఎండల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి ఏప్రిల్ నెలలో పంపిణీ చేయనున్నాయి. దీనివల్ల తీవ్రమైన ఎండలలో పదేపదే రేషన్ షాపులకు వెళ్లకుండా లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుండి రేషన్ షాపులకు బియ్యం సరఫరాను మొదలుపెట్టింది.

telangana govt said Good News for Ration Card Holders New Ration Shops three months ration in april

వచ్చే నెలలో రేషన్ ఇస్తారిలా

ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్క సభ్యులకు ఆరు కిలోల సన్న బియ్యం అందుతుంది. అయితే మూడు నెలల కోటాను ఒకేసారి ఇస్తున్న కారణంగా వచ్చే నెలలో ఒక్కో లబ్దిదారునికి 18 కిలోల బియ్యం లభిస్తుంది. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ సరఫరాల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం రేషన్ కార్డుదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది గతంలోనూ అనేక సార్లు ఒకేసారి మూడు నెలల రేషన్ ను పంపిణీ చేశారు.

అంత్యోదయ కార్డుల వారికి రేషన్ ఇలా

ఇదిలా ఉంటే అంత్యోదయ కార్డులు ఉన్న వారికి నెలకు 35 కిలోల చొప్పున మూడు నెలలకు 105 కిలోలు రేషన్ అందుతుంది. ఇక ప్రస్తుతం రేషన్ కార్డుదారులు పోర్టబిలిటీ సౌకర్యం ఉన్న కారణంగా ఏ రేషన్ షాప్ లో నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న కారణంగా బయోమెట్రిక్ మెషిన్ లలో సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తున్నారు.

టెన్త్ స్టూడెంట్‌పై టీచర్ అఘాయిత్యం.. సీక్రెట్ కెమెరాలో రికార్డ్.. ట్విస్ట్ ఏంటంటే
టెన్త్ స్టూడెంట్‌పై టీచర్ అఘాయిత్యం.. సీక్రెట్ కెమెరాలో రికార్డ్.. ట్విస్ట్ ఏంటంటే

సరఫరా విషయంలో ప్రణాళిక చేస్తున్న పౌర సరఫరాల శాఖ

ఈ క్రమంలో ఒకేసారి మూడు నెలల వేలిముద్ర ధృవీకరణలను తీసుకునేలా బయోమెట్రిక్ మెషీన్ లలో మార్పులు చేస్తున్నారు. అయితే వందల క్వింటాళ్ల బియ్యాన్ని నిల్వ చేయడానికి రేషన్ షాపుల్లో ప్రస్తుతం తగినంత స్థలం లేదని సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం రేషన్ షాపులు చాలా చిన్న చిన్న షాపులలో నడుస్తున్నాయి. డిమాండ్ మేరకు డీలర్లకు సరుకులను సరఫరా చేయడానికి ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+