మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనలో నలుగురు సస్పెన్షన్, మాజీమంత్రి ఫైర్!

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటనపై అందరూ ఆస్పత్రిలో మార్చురీలో సిబ్బంది ఏమైపోయారు అని చర్చిస్తున్నారు. ఇక ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా వ మన వైద్య ఆరోగ్య వ్యవస్థలోని డొల్ల తనాన్ని సూచిస్తుంది. అయితే మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటన దారుణమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

ఆస్పత్రి మార్చురీని సందర్శించిన మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి

గతంలో ఎప్పుడూ చూడని విధంగా మార్చురీ గదిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం వైద్య అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ,వంద పడకల ఆసుపత్రిని,నూతనంగా నిర్మించిన మార్చురీ బిల్డింగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

telangana govt suspended 4 officials in the stray dogs mutilated a dead body incident in jadcherla

బీఆర్ఎస్ పాలనలో ఆస్పత్రులలో అన్నీ ఉన్నాయన్న మాజీ మంత్రి

మార్చురీ గదిలో ఫ్రీజర్లు లేవని, మృతదేహాలను స్ట్రెచర్ పై కాకుండా నేలపై పెట్టడం దురదృష్టకరమని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదని వెల్లడించారు. కనీస సౌకర్యాలు కల్పించక హాస్పిటళ్లు దీనావస్థకు చేరుకుంటున్నాయని వివరించారు. వసతులు లేవు. మందులు లేవని దుయ్యబట్టారు..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్పిటళ్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, కొత్త హాస్పిటల్స్ నిర్మించామన్నారు.

కొత్త మార్చురీ బిల్డింగ్ కంప్లీట్ అయినా వాడుకోలేదు

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించామని వెల్లడించారు. పాత రోజులు తెస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిజం చేసిందన్నారు.కొత్త హాస్పిటల్‌లో 2024 జూన్ లోనే మార్చురీ బిల్డింగ్ కంప్లీట్ అయినా వాడుకోలేదని పేర్కొన్నారు. నిజంగానే మౌలిక సదుపాయాలూ లేని, ఎవరినీ పట్టించుకోని పాతరోజులను తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతదేహం కుక్కలు పీక్కుతిన్న ఘటనలో నలుగురు సస్పెన్షన్

ఇదిలా ఉంటే మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. విచారణ అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్యారోగ్య శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. మార్చురీలో పని చేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+