కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లో చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ పైన కసరత్తు మొదలు పెట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు వేచి చూస్తున్నారు. కాగా, 2026-27 ఆర్దిక సంవత్సరంలో కొత్త గా రెండు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. ఇప్పుడు వీరికి అమలు విషయం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రెండు లక్షల మందికి చేయూత పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. బడ్జెట్‌లో కూడా వీటికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పథకం ద్వారా నెలనెలా పింఛన్లను అందించనున్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చసారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా లక్ష మందికి పింఛన్లను మంజూరు చేశామని, వచ్చే ఆర్ధిక సంవత్సరం లో రెండు లక్షల పింఛన్లను కొత్తగా జారీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే బడ్జెట్‌లో వీటిని నిధులను కూడా కేటాయించి నట్లు వివరించారు. పింఛన్లను తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం అనర్హులు, మరణించినవారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేసారు.

జూన్ 2 నుంచి పంపిణీ చేసేందుకు కసరత్తు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ది దారులు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి... ఆమోదం పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాల నుంచి కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. అర్హత ఉన్న వారి సంఖ్య పైన ఆరా తీస్తోంది. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని భావిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రెండు పించన్లు పొందుతున్నవారిని పేర్లను తొలగిస్తున్నామని.. అర్హులకు ఎలాంటి సమస్య ఉండదని మంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications