హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం!: తప్పుడు ప్రచారం చేస్తే కేసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మూడు ల్యాబ్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, చికిత్స అవకాశం కల్పించిన సర్కారు.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

గచ్చిబౌలి స్టేడియాన్ని 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలో గల పరిపాలన విభాగంతోపాటు అందుబాటులో ఉన్న గదులను తమ ఆధీనంలోకి తీసుకుని ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దుతున్నారు.

Telangana govt to set up 50-bed isolation ward in Gachibowli stadium

ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు స్టేడియాన్ని పరిశీలించారు. శేరిలింగంపల్లి సర్కిల్ 11 పారిశుద్ధ్య విభాగం సిబ్బంది స్టేడియంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ స్టేడియాన్ని రెండ్రోజుల్లో పూర్తి స్థాయి క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు.

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు..
కాగా, కరోనావైరస్ కట్టడికి ఇప్పటికే తెలంగాణ సర్కారు ముందస్తు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదవగా, మరో ఇద్దరు అనుమానిత లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో కరోనా వ్యాపిస్తుందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై సర్కారు చర్యలకు ఉపక్రమించింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు వారిపై కేసు పెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనావైరస్ సోకిందని వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేటకు చెందిన ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కరోనావైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

English summary
Telangana govt. to set up 50-bed isolation ward at Gachibowli stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X