చూస్తూ ఊరుకోం..! మీడియాకు తెలంగాణ సర్కార్ తీవ్ర హెచ్చరికలు..!

తెలంగాణలో మంత్రి, మహిళా ఐఏఎస్ కు లింకులు పెట్టేలా కథనాలు ప్రసారం చేసిన ఎన్టీవీతో పాటు పలు వెబ్ సైట్లు, సోషల్ హ్యాండిల్స్ పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇప్పటికే ఎన్టీవీ సహా ఇతర మీడియా అవుట్ లెట్ల జర్నలిస్టుల్ని అరెస్టులు చేసిన హైదరాబాద్ పోలీసులు.. వీరికి బెయిల్ లభించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు కూడా సిద్ధమవుతున్నారు. దీనికి కొనసాగింపుగా మీడియా ఛానళ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ తీవ్ర స్ధాయిలో హెచ్చరికలు చేశారు.

రాష్ట్రంలో వ్యక్తులు, ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చేలా, సర్కార్ ను భ్రష్టుపట్టించేలా కథనాలు ప్రసారం చేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు. ధైర్యముంటే ఆధారాలతో బయటపెట్టాలని ఆయన సూచించారు. అలా కాకుండా కుట్రపూరితంగా కథనాలు ప్రసారం చేస్తే చూస్తూ ఊరుకోమని ఇవళ మీడియా ఛానళ్లను హెచ్చరించారు. అవాస్తవాలతో రాక్షసానందం పొందితే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆధారాలు లేకుండా మొసలి కన్నీరు కార్చే వారిపైనా కఠిన చర్యలు తప్పవని పొన్నం వార్నింగ్ ఇచ్చారు.

Telangana govt vs media minister ponnam Prabhakar warns against defamatory stories

ఏంటీ మెంటల్ హెరాస్మెంట్ ? తెలంగాణ పోలీసులపై ఎన్టీవీ యాంకర్ దేవి ఫైర్..!
వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని మంత్రి పొన్నం ఆరోపించారు. ప్రభుత్వ చర్యలపై మొసలి కన్నీరు కార్చే వారు సైతం వారి కుటుంబాలకు ఇదే జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. రాజకీయ ఉద్దేశాలతో మీడియా వ్యవహరిస్తే అందుకు తగినట్లుగానే చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఇది ఎన్ని రోజులు నడుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థులు ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, తమ చర్యలకు వారు బాధ్యత వహించక తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+