హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యుములోనింబస్ ఎఫెక్ట్: 16 కి.మీ.లపై ప్రభావం, హైద్రాబాద్‌‌ను ముంచెత్తింది

ఉన్నట్టుండి ఒక్కటే సారి వాతావరణం మారిపోతోంది, ఎర్రటి ఎండ మాయమై..... భారీ వర్షం కురుస్తోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉన్నట్టుండి ఒక్కటే సారి వాతావరణం మారిపోతోంది, ఎర్రటి ఎండ మాయమై..... భారీ వర్షం కురుస్తోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయి. ఈ మేఘాలు భారీ వర్షానికి కారణంగా మారుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.హైద్రాబాద్‌ను అతలాకుతలం చేసిన భారీ వర్షానికి క్యుములోనింబస్ మేఘాలే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

హైద్రాబాద్‌‌ను ముంచేసిన వర్షం: భయం గుప్పిట్లో...హైద్రాబాద్‌‌ను ముంచేసిన వర్షం: భయం గుప్పిట్లో...

క్యుములోనింబస్ మేఘాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందంటున్నారు. ఈ మేఘాల కారణంగా కొన్ని సమయాల్లో రికార్డు స్థాయిల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడ ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.

వర్షం ఎఫెక్ట్: 6 ఫీట్ల ఎత్తులో ఎగజిమ్మిన విషపు నురగ, భయంతో ఇళ్ళలోనే..వర్షం ఎఫెక్ట్: 6 ఫీట్ల ఎత్తులో ఎగజిమ్మిన విషపు నురగ, భయంతో ఇళ్ళలోనే..

వాతావరణ కాలుష్యం కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు. దీనికితోడు వాతావరంణలో చోటుచేసుకొంటున్న మార్పులు కూడ కారణంగా మారుతున్నాయంటున్నారు.

క్యుములోనింబస్ మేఘాలు ఎందుకు ఏర్పడతాయంటే?

క్యుములోనింబస్ మేఘాలు ఎందుకు ఏర్పడతాయంటే?

వాతావరణంలో అనూహ్యమార్పులు చోటుచేసుకోని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి క్యుములోనింబస్ మేఘాలు కారణమమౌతున్నాయి.

హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన టెర్రర్‌ ఈ మేఘాలే. . గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల సంభవించే వాతావరణ అస్థిరత, నానాటికి పెరుగుతున్న్న కాలుష్యంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతున్నాయి.

16 కిలోమీటర్ల ప్రభావం చూపనున్న క్యుములోనింబస్ మేఘాలు

16 కిలోమీటర్ల ప్రభావం చూపనున్న క్యుములోనింబస్ మేఘాలు

క్యుములోనింబస్ మేఘాలు తక్కువ సమయంలోనే ఒకటి నుంచి 16 కిలోమీటర్ల్ విస్తీర్ణం మేర ప్రభావం చూపుతాయని చెప్పారు.హైదరాబాద్‌లో మాత్రం వీటి ప్రభావం మరింతగా ఉంటోందని అంటున్నారు. క్యుములోనింబస్‌ మేఘాల తీవ్రత ఎండాకాలంలో కన్నా వర్షాకాలంలోనే ఎక్కువని చెబుతున్నారు. ఈ మేఘాలకు ఉపరితల ఆవర్తనం తోడవడంతో పలు ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురుస్తున్నాయి.

తూర్పు దిశ నుండి వేడిగాలులతో ఆకస్మాత్తుగా వాతావరణ మార్పులు

తూర్పు దిశ నుండి వేడిగాలులతో ఆకస్మాత్తుగా వాతావరణ మార్పులు

తూర్పుదిశ నుంచి తేమశాతం నేలమీదకు చొచ్చుకొని వేడిగాలుల కలయికతో ఆకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.వేసవికాలంలో భూమికి సుమారు 15 కిలో మీటర్ల ఎత్తులో ఉండే క్యూములోనింబస్‌ మేఘాలు.. వర్షాకాలానికొచ్చేసరికి 10 కిలోమీటర్ల ఎత్తు నుంచే కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెప్పారు. కొన్ని సందర్భాల్లో భూమికి 1-2 కిలోమీటర్ల ఎత్తులోనూ కురిసే అవకాశాలుంటాయని చెబుతున్నారు.

3 గంటలపాటు వర్షాలు

3 గంటలపాటు వర్షాలు

క్యుములోనింబస్ మేఘాల కారణంగా సాధారణంగా 30 నిమిషాల నుంచి గరిష్ఠంగా 2-3 గంటల పాటు వరకు కొనసాగే అవకాశాలుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం కురిసిన భారీవర్షానికి ఉపరితల ఆవర్తన ద్రోణికి క్యుములోనింబస్‌ మేఘాలు జతకావడంతో పలు ప్రాంతాల్లో అత్యధికంగా 12 నుంచి 13.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరవ్యాప్తంగా వర్షపాతం 13.5 సెం.మీ కాగా రెండే రెండు గంటల్లో పలు ప్రాంతాల్లో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగంరంలో ప్రాంతాల భౌగోళిక స్వరూపం, వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల ప్రభావంతో నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో 2016 సెప్టెంబరు 20, 21 తేదిలలో భారీవర్షాలు కురిశాయని అదే తరహాలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి.

ఉష్ణోగ్రతల్లో అనుహ్యమార్పులు

ఉష్ణోగ్రతల్లో అనుహ్యమార్పులు

ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు సంభవిస్తుండడంతో వాతావరణ మార్పులను సరిగా అంచనా వేయలేకపోతున్నామని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇండియా డ్రాటికల్‌ కంట్రీ. శీతాకాలంలో మైనస్‌ డిగ్రీలు.. వేసవిలో 50సెంటిగ్రేడ్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగత్రలు నమోదవుతాయి. ఇంత వ్యత్యాసం ఉన్న చోట వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేయలేం. యూరప్‌ దేశాల్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతల్లో తేడా ఉండదు.' అని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వర్షాలు ఎక్కువగా కురవాలంటే ఇలా

వర్షాలు ఎక్కువగా కురవాలంటే ఇలా

సాధారణంగా మాన్‌సూన్‌ సీజన్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఏర్పడి, రుతుపవనాల ద్రోణి దక్షిణదిశగా చురుకుగా కదిలితే ఆ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం ఉత్తర ఒడిసా, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం వలన ఉత్తర దిశగా కదలడంతో పాటు దాని అనుబంధంగా ఉన్న ద్రోణి ఛత్తీస్ గఢ్‌, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక వరకు కొనసాగుతుందని వాతావరణ అధికారులు చెప్పారు.

English summary
The MeT department has predicted more rains on Wednesday in the city which is reeling under the impact of heavy downpour, even as the civic body and other agencies are trying to restore normalcy in affected areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X