హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, హిమయత్ నగర్, చందానగర్, మియాపూర్, జూబ్లీహిల్స్, మదాపూర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, ఓల్డ్ సిటీ, దిల్‌సుఖ్ నగర్, కర్మన్ ఘాట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఏపీలోను భారీ వర్షాలు
ఏపీలోను పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. గుంటూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. నరసారావుపేట మండలం దొండపాటు, పిమిడిపాడులో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. క్రోసూరులో మహిళ మృతి చెందగా, ఫిరంగిపురం మండలం యర్రగుంటపాడులో ఒకరు మృతి చెందారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో ఒక వ్యక్తి మృతి చెందారు.
Telangana: Heavy rain lashes parts of Hyderabad. pic.twitter.com/hoJiShGyYt
— ANI (@ANI) May 31, 2018












Click it and Unblock the Notifications