ఐఏఎస్ ఆమ్రపాలి ఎవరిని ప్రేమించిందో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో డైనమిక్ ఆఫీసర్ గా ఆమ్రపాలి పేరు తెచ్చుకున్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా మూడు సంవత్సరాలు పనిచేశారు. తన పనితీరుతో అక్కడ కలెక్టర్ గా చేసిన సమయంలో బాగా హైలైటయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.
వరంగల్ లో పనిచేసిన తర్వాత పీఎంవోకు బదిలీపై వెళ్లారు. తాజాగా తెలంగాణకు తిరిగివచ్చిన ఆమెను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా నియమించింది. కమిషనర్ గా నియమితులైన తర్వాత నెటిజన్లు ఆమెకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. 1982 నవంబరు 4న విశాఖపట్నంలో జన్మించారు. ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశారు. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పూర్తిచేశారు.

2010లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి ఐఏఎస్‌కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సమీర్‌శర్మను ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 18న వీరి వివాహం జరిగింది. అతి తక్కువగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యలో ఈ వివాహం జరిగింది. ఢిల్లీకి చెందిన సమీర్ 2011లో ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. ఆమ్రపాలి తెలుగమ్మాయి.. సమీర్ ఉత్తరాదికి చెందినవారు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. జమ్ములో సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications