Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త డేట్స్ ఇవే

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే, జూన్ 4న జేఈఈ పరీక్షలు ఉండటంతో సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డ్ రీ షెడ్యూల్ చేసింది.

జూన్ 12 నుంచి 20 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఈయర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్స్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ఇంటర్ బోర్డు తెలిపింది.

Telangana inter supplementary exam dates changed: new dates

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డ్ పొడిగించింది. నేటి(మంగళవారం)తో గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు మే 19 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువును కూడా మే 19 వరకు పొడిగించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా, ఇటీవలే తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మే 9న హైదరాబాద్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈసారి జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి అయినట్లు సబిత వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 61.88 శాతం, రెండో సంవత్సరంలో 63.49 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ బాలికలు టాప్ లో నిలిచారు.

ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకూ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇందులో 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ లో మొత్తం 4,33.82 మంది పరీక్ష రాయగా.. ఇందులో 2.72,208 ఉత్తీర్ణులు అయ్యారు. ఇందులో ఏ గ్రేడ్‌ 1,60 వేల మంది, బి గ్రేడ్‌ 68వేల 330 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బాలికలు -2,17454 మందికి లక్షా 1,49729 మంది పాస్ అయ్యారు.

ఈసారి ఇంటర్ ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్‌లో బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలురు 54.66 శాతం మాత్రమే పాసయ్యారు. సెకండియర్‌లో బాలికల 71.57 శాతం పాస్ కాగా.. బాలురు 55.60 శాతం మాత్రమే పాసయ్యారు. అలాగే ఈ ఏడాది తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్ లో మేడ్చల్ జిల్లా, సెకండియర్ లో ములుగు జిల్లా టాప్ లో నిలిచాయి. జూన్ 4 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+