Telangana Inter Results 2023 : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ హైదరాబాద్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈసారి జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి అయినట్లు సబిత వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 61.88 శాతం, రెండో సంవత్సరంలో 63.49 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ బాలికలు టాప్ లో నిలిచారు.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ మీడియట్ బోర్డు వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచారు. ఇందులో ఫలితాలను అప్ లోడ్ చేశారు. https://tsbienew.cgg.gov.in , https://results.cgg.gov.in వెబ్ సైట్లలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నంబర్ తో లాగిన్ అయి వీటిలో ఫలితాలను తెలుసుకోవచ్చు. వీటితో పాటు పలు న్యూస్, ఎడ్యుకేషన్ వెబ్ సైట్లు కూడా ఫలితాలను అందుబాటులో ఉంచుతున్నాయి.

ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకూ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇందులో 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ లో మొత్తం 4,33.82 మంది పరీక్ష రాయగా.. ఇందులో 2.72,208 ఉత్తీర్ణులు అయ్యారు. ఇందులో ఏ గ్రేడ్ 1,60 వేల మంది, బి గ్రేడ్ 68వేల 330 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బాలికలు -2,17454 మందికి లక్షా 1,49729 మంది పాస్ అయ్యారు.
ఈసారి ఇంటర్ ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్‌లో బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలురు 54.66 శాతం మాత్రమే పాసయ్యారు. సెకండియర్‌లో బాలికల 71.57 శాతం పాస్ కాగా.. బాలురు 55.60 శాతం మాత్రమే పాసయ్యారు. అలాగే ఈ ఏడాది తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్ లో మేడ్చల్ జిల్లా, సెకండియర్ లో ములుగు జిల్లా టాప్ లో నిలిచాయి. జూన్ 4 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అలాగే ఈ సారి పరీక్షలు పాస్ కాకపోతే నిరుత్సాహానికి గురి కావొద్దని అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని కోరారు. విద్యార్ధుల తల్లితండ్రులు కూడా వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని విద్యా్మంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications