TG Inter Result: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆరోజే..?

తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 లక్షలకు పైగా విద్యార్థులకు ఇంటర్ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెలలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెలలో 12వ తేదీలోగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ రోజున ఫలితాలు వెల్లడి కావడం లేదని తెలుస్తోంది.

అయితే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. మరో రెండు రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ పూర్తికానుంది. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే కొంతమంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో కేవలం 2-3 మార్కుల తేడాతో ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ కేసులను ఎలా పరిష్కరించాలన్న దానిపై అధికారుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఓ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఫైనల్ రిజల్ట్స్ ను ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన సమయంలో పొరపాట్లు లేదా సాంకేతిక సమస్యలను నివారించడానికి ఇంటర్ బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది.

ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు జరిగాయి. అలాగే రెండో సంవత్సరం పరీక్షలు 2026 ఫిబ్రవరి 26 నుండి మార్చి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 4 న ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం తుది దశలో ఉంది. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 9, 97, 075 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 4,89,126 మంది ఫస్టియర్, 5,07,949 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.

telangana Intermediate Results Likely to Be Delayed Spot Valuation to Finish in 2 Days Inter

విద్యార్థులు తమ ఫలితాల కోసం అధికారిక వెబ్‌ సైట్ tgbie.cgg.gov.in లో లాగిన్ కావొచ్చు. హోమ్ పేజ్‌ మీద ఉన్న రిజల్ట్స్ లింక్ ను క్లిక్ చేసి హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ బటన్ నొక్కడంతో ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+