తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రమే, 2,400 కోట్ల అప్పులు తెచ్చుకోవచ్చు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం 2014-15లో మిగులు రాష్ట్రమేనని అకౌంటెంట్ జనరల్ నిర్ధారించారు. ఈ వివరాలను పరిశీలించి ఈ ఏడాది మరో రూ.2,433 కోట్ల మేర అప్పులను తెచ్చుకోవటానికి కేంద్రం అనుమతి ఇవ్వొచ్చని రాష్ట్ర ఆర్థిక శాఖ భావిస్తోందని తెలుస్తోంది.
రాష్ట్రం రానున్న మూడు నెలల్లో రూ.4వేల కోట్లను మాత్రమే అప్పులను తెచ్చుకోవచ్చని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. రెవెన్యూ ఖర్చుల కంటే రాబడులు అధికంగా ఉంటూ... రాష్ట్రం 2014-15లో రెవెన్యూ మిగులును సాధించినట్టు వివిధ పద్దుల ఆధారంగా రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ నిర్ధారించారు.

రైతు సమస్యలు: గవర్నర్‌కు వివరించిన కెసిఆర్
తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణతోపాటు వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం గవర్నర్ నరసింహన్‌కు తెలిపారు. సమగ్ర ప్రణాళికను రూపొందించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
గురువారం రాత్రి ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. రెండున్నర గంటల పాటడు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి ప్రభుత్వ కార్యాచరణపై నివేదికను సమర్పించినట్లు తెలిసింది.
సమస్యల మూలాల్లోకి వెళ్లాలనే హైకోర్టు సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రెండో విడత పంట రుణాల మాఫీ ముగిసిందని, రైతులను అప్పుల కోసం ఇబ్బంది పెట్టరాదని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు.
ఒకే దఫా మొత్తం అప్పును మాఫీ చేయాలనే వినతులు వస్తున్నాయని, ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను వివిధ మార్గాల ద్వారా సమీకరించడంతో పాటు ఇతర మార్గాలను ఆన్వేషిస్తున్నామన్నారు.రైతులకు తగిన సూచనలు, సలహాలను ఇచ్చేందుకు విస్తరణాధికారిని నియమించనున్నామన్నారు.












Click it and Unblock the Notifications