మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల సాక్షిగా.. రేవంత్

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వెలిసిన సమ్మక్క- సారలమ్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మొక్కు చెల్లించుకున్నారు. మనవడితో కలిసి తులాభారాన్ని సమర్పించారు. వన దేవతలకు నిలువెత్తు బెల్లాన్ని కానుకగా అందజేశారు. ఆదివారం సాయంత్రం మేడారంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన ఆయన రాత్రి స్థానిక హరిత హోటల్ లో బస చేశారు. ఈ తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం రేవంత్ రెడ్డి.. ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాలకు హాజరు కావడానికి నేడు స్విట్జర్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్నారు. మేడారం నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ ఉదయం 9: 30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఆయనతో పాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్తారు.

Telangana IT AI Life Sciences Sectors on Spotlight as CM Leads WEF Engagements in Davos

ఈ నెల 20వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు దావోస్‌లో జరిగే సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రముఖ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలను నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వారికి వివరిస్తారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాల గురించి వారికి తెలియజేస్తారు.

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ అవుతారు. అలాగే పలు రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరుపుతారు.

తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. తెలంగాణ రైజింగ్ విజన్‌, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు కూడా. మంత్రివర్గ సమావేశంలో సైతం దావోస్ పర్యటన గురించి ప్రస్తావించారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే ఉద్దేశమని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+