వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ చీరెల పంపిణీ: 'వారంరోజుల నుండే కుట్ర, ఇదీ జరిగింది'

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Bathukamma Sarees Controversy : KTR spoke to mediaచీరెలను తగులబెట్టింది ఆడవాళ్ళు కానే కాదు!|Oneindia

హైదరాబాద్:బతుకమ్మ చీరెల పంపిణీలో విపక్షాలు అనసవర రాద్దాంతం సృష్టించాయని తెలంగాణ ఐటీ
శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. చీరెలు నచ్చకపోతే ఎవరూ కూడ తగుబబెట్టరని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. మహిళల చేతుల్లో నుండి చీరెలను లాక్కొని కాల్చారని ఆయన చెప్పారు. అందుకే వారిపై కేసులు నమోదుచేసినట్టు మంత్రి కెటిఆర్ చెప్పారు.

బతుకమ్మ చీరెల పంపిణీ విషయంలో విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 4 లక్షల మందికి చీరెల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు చెప్పారు.

అయితే లక్షలాది చీరెల పంపిణీ సమయంలో ఏదైనా పొరపాటుచోటుచేసుకొంటే ప్రతిపక్షాల నుండి సలహలను ఇవ్వాలని మంత్రి కెటిఆర్ విపక్షాలకు సూచించారు. విపక్షాలు బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

విపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకొని మీడియా కూడ వ్యవహరించాలని కెటిఆర్ సూచించారు.

వారం రోజుల ముందే విపక్షాల కుట్ర

వారం రోజుల ముందే విపక్షాల కుట్ర

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు కార్యక్రమాలతో విపక్షాలు రాష్ట్రంలో పునాదులు లేకుండా పోతోందనే భయం పట్టుకొందని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఈ కారణంగానే బతుకమ్మ చీరెల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపణలు చేశారు. వారం రోజుల క్రితమే విపక్షాలు చీరెల పంపిణీని అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

చీరెలను తగులబెట్టింది రాజకీయ పార్టీల కార్యకర్తలే

చీరెలను తగులబెట్టింది రాజకీయ పార్టీల కార్యకర్తలే


మహిళల చేతుల నుండి చీరెలను తగులబెట్టింది రాజకీయపార్టీల కార్యకర్తలేనని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లాలో కేసు నమోదైన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.ఆ జిల్లా ఎస్‌పికి ఫోన్ చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని మంత్రి మీడియాను కోరారు.రాజకీయపార్టీల కార్యకర్తలు లేరని ఎలా చెబుతారంటూ మంత్రి ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

25 లక్షల చీరెల పంపిణీ

25 లక్షల చీరెల పంపిణీ


బతుకమ్మ చీరెల పంపిణీ సందర్భంగా తొలిరోజు 25 లక్షల చీరెలను పంపిణీ చేసినట్టు మంత్రి కెటిఆర్ చెప్పారు. రాష్ట్రంలో సుమారు 1 కోటి 4 లక్షల మందికి చీరెలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురైన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.అది కూడ విపక్షాల కుట్రే కారణమన్నారు. చేనేత కార్మికులకు పని కల్పించడం విపక్షాలకు ఇష్టం లేదన్నారు. సిరిసిల్లతో పాటు సూరత్ నుండి కూడ చీరెలను తెప్పించామన్నారు మంత్రి కెటిఆర్.

చీరెల పంపిణీని అడ్డుకొనే కుట్ర

చీరెల పంపిణీని అడ్డుకొనే కుట్ర

ప్రతిపక్షాలు భావ దారిద్ర్యంతో ఉన్నాయని ఘాటైన విమర్శలు చేశారు. లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ, ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని హితవుచెప్పారు. చీరలను తగులబెట్టడం మంచి సంప్రదాయం కాదని, చీరలు నచ్చకపోతే ఎవరూ తగులబెట్టరు అని అన్నారు. హ్యాండ్లూమ్‌కు, చేనేతకు తేడా తెలియని స్థితిలో కొందరు సన్నాసులున్నారని, అలాంటి వాళ్లా సిరిసిల్లపై విమర్శలు చేసేది? అని తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. నేతన్నల బాగును చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చీరలను తగులబెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చీరెల పంపిణీని రాజకీయాలకు వాడుకొన్నారు

చీరెల పంపిణీని రాజకీయాలకు వాడుకొన్నారు

బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని విపక్షాలు తమ రాజకీయలబ్దికోసం వాడుకొన్నారని నిజామాబాద్ ఎంపీ కవిత ఆరోపించారు. చీరెల పంపిణీని మహిళలు సెంటిమెంట్‌గా భావిస్తారని ఆమె గుర్తుచేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే విపక్షాలు ఈ కార్యక్రమానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.

English summary
Telangana minister KTR condemned opposition parties attitude on Bathukamma sarees.opposition parties conspiracy on Bathukamma sarees said minister Ktr. minister KTR spoke to media on Monday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X