కన్నీరు పెట్టుకొన్న కేటీఆర్, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాన్న నా ప్రాణం కాపాడంటూ 15 ఏళ్ళ బాలిక సాయిశ్రీ తన తండ్రికి వాట్సాప్ లో సెల్పీ వీడియో పంపిన ఘటనతో కన్నీళ్ళు పెట్టుకొన్నట్టు తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు.

ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన సాయిశ్రీ క్యాన్సర్ వ్యాధితో మరణించింది.ఆమె మరణించడానికి ముందుగా తనకు ట్రీట్ మెంట్ చేయించాలని తన తండ్రికి వాట్సాప్ లో సెల్పీ వీడియోను పంపింది.

ktr

అయితే భార్య, భర్తలు విడిపోయారు. అయితే కూతురు పేరున ఉన్న ఇంటిని విక్రయించకుండా కొందరు కబ్జాదారులు అడ్డుకొన్నారు.దీంతో సాయిశ్రీకి ట్రీట్ మెంట్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి.అయితే ఇతర పిల్లల మాదిరిగానే తాను ఆడుకోవాలనుకొంటున్నాను. తనకు ట్రీట్ మెంట్ చేయించాలని ఆ కూతురు తండ్రికి వాట్సాప్ లో సెల్పీ వీడియో తీసి పోస్ట్ చేసింది.

ఈ సెల్పీ వీడియో ను వార్తను చూసిన తెలంగాణ మంత్రి కెటిఆర్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వార్త తనను చలింపచేసిందన్నారు. ఈ వార్త చూసి కంటతడిపెట్టానని చెప్పారు. మానవీయవిలువలు ఇంతలా పతనమౌతున్నాయా అంటూ జరుగుతున్న పరిణామాలపై చింతిస్తూ తన ఆవేదనను ఆయన ట్విట్టర్ లో వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవత్వానికి ఓ దెబ్బలాంటిదన్నారు కెటిఆర్.

మరో వైపు ఈ ఘటనపై హెచ్ఛార్సీలో ఫిర్యాదు చేసింది బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అత్యుత్ రావు. దీనిపై స్పందించిన హెచ్ ఆర్సీ . ఈ ఘటనపై జూలై 29 లోపుగా నివేదిక ఇవ్వాలని విజయవాడ నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana IT minister KTR responded on Saisree death incident, Gut wrenching inicident brought tears to my eyes minute, I saw the news and video, blot on humanity and human realations.
Please Wait while comments are loading...