మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి: మా బిడ్డల కోసమేనన్న ఎంపీ కవిత
హైదరాబాద్: మహారాష్ట్రలోను తెలంగాణ జాగృతి విభాగం ఏర్పాటు అయింది. మహారాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా అశోక్ రాజగిరి, ఉపాధ్యక్షులుగా డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, వెంకట్ తుత్తూరు, ఎస్ వేణుగోపాల్, కోశాధిగారిగా సురేందర్ నియమితులయ్యారు.
యువజన విభాగం అధ్యక్షుడిగా కూరపాటి నరేష్, సాహిత్య విభాగం అధ్యక్షుడిగా సంగినేని రవీంద్ర నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో జరిగిన సమావేశంలో కమిటీని ప్రకటించారు.

తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ, రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ జాగృతి సంస్థ విస్తృతంగా సేవలందిస్తోందని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అన్ని వర్గాల వారిని కలుపుకొని వివిధ రంగాల్లో స్ఫూర్తిని నింపేందుకు క్షేత్రస్థాయిలో కార్యవర్గాలను నెలకొల్పామన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలను కూడా ఒక వేదిక పైకి తెచ్చేందుకు తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని ఆమె చెప్పారు. వివిధ దేశాల్లోనూ తెలంగాణ జాగృతి శాఖలున్నట్లు తెలిపారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications