కారు స్టీరింగ్ రజాకార్లు..ఖాసిం రజ్వీ వారసుల చేతుల్లో: కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన రోజును అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు. మజ్లిస్ కనుసన్నల్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని, ఆ పార్టీ నేతలకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించట్లేదని ఆరోపించారు.

నాలుగు కోట్ల మంది ప్రజల మనోభావాలకు లెక్కలేదా?

నాలుగు కోట్ల మంది ప్రజల మనోభావాలకు లెక్కలేదా?

తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా కేసీఆర్.. విమోచన దినోత్సవం గురించి ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం దాని గురించి మాట్లాడటం కూడా లేదని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ- తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వస్తున్నామని, అయినప్పటికీ- తమ డిమాండ్లు, నాలుగు కోట్ల మంది ప్రజల మనోభావాలను కేసీర్ సర్కార్ పట్టించుకోవట్లదేని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దండి..

గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దండి..

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు చేసిన తప్పులను సరి చేయాల్సిన బాధ్యత.. టీఆర్‌ఎస్‌‌పై ఉందని, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోలేకపోవడం బాధాకరమని అన్నారు. పేరుకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, నిజానికి ఆ పార్టీ స్టీరింగ్ మొత్తం అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నేతల చేతల్లో ఉందని మండిపడ్డారు. మజ్లిస్ నేతలు రజాకార్లు, ఖాసిం రజ్వీ వారసులని బండి సంజయ్ విమర్శించారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ విమోచన దినోత్సవాలు..

ప్రతికూల పరిస్థితుల్లోనూ విమోచన దినోత్సవాలు..

ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలను నడిపించిన అధికార పార్టీలు చేయలేని పనిని, తాము చేస్తోన్నామని బండి సంజయ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు, ప్రత్యేక తెలంగాణలో కూడా సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరుపుకొన్నామని చెప్పారు. వచ్చే విమోచన దినోత్సవాన్ని నిర్మల్‌లో నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. వెయ్యి మంది తెలంగాణ విమోచన యోధులను ఉరి తీసిన నిర్మల్‌లోని వెయ్యి ఉరీల మర్రి వద్ద- బీజేపీ రాష్ట్రశాఖ తరఫున బహిరంగ సభను నిర్వహిస్తున్నామని అన్నారు.

మా డిమాండ్లివీ..

మా డిమాండ్లివీ..

విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తాము కొన్ని డిమాండ్లను కేసీఆర్ ముందు ఉంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. వాటి గురించి ఈ బహిరంగ లేఖలో ప్రస్తావించారు. రజాకార్లు, ఖాసిం రజ్వీ వారసులైన మజ్లిస్ కబంధ హస్తాల నుంచి, సూడో సెక్యులర్ వాదుల భావాల నుంచి బయటపడి- తమ డిమాండ్లను నెరవేర్చాలని బండి సంజయ్ అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు.

తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం..

తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం..

తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించాలని, దీనికోసం స్థలాన్ని కేటాయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంత ఆ భవనం నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పారు. తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, వచ్చే సంవత్సరం నాటికి దాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన ఉద్యమం సందర్భంగా రజాకార్ల చేతుల్లో బలైన వారి కుటుంబాలను గుర్తించి, అధికారికంగా సన్మానం చేయాలని చెప్పారు.

ఆ కుటుంబాలను సత్కరించండి..

ఆ కుటుంబాలను సత్కరించండి..

ఆ కుటుంబాలను ఆదుకోవాలని, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం వారిని సత్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమచన పోరాట చరిత్రను, ఆ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని బండి సంజయ్ చెప్పారు. రజాకార్లను తరిమి కొట్టిన వీరభైరాన్ పల్లి, వరంగల్ కోట, రేణికుంట, కడవెండి, కామారెడ్డి గూడెం, పరకాల, సూర్యాపేట్, బీబీ నగర్, బాలెంల-పెరుమాండ్ల తదితర ప్రాంతాల్లో విమోచన ఉద్యమ స్మృతులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+