విషాదం: షార్జాలో తెలంగాణ వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం నెలకొంది. కోరుట్లకు చెందిన వ్యక్తి షార్జాలో దారుణ హత్యకు గురయ్యాడు. కోరుట్ల రవీంద్ర రోడ్డుకు చెందిన దేశవేని నర్సయ్య, రాధ దంపతుల రెండో కుమారుడు నవీన్(28) ఆరు నెలల క్రితం ఉపాధి కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జా నగరానికి వెళ్లాడు.
షార్జాలోని ఓ కంపెనీలో కారు వాషింగ్ చేసేపని చేస్తున్నాడు. మే 23న రాత్రి తన గదిలో నవీన్ భోజనం చేస్తుండగా.. కేరళకు చెందిన వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కత్తితో నవీన్‌ను పలుమార్లు పొడిచాడు.

తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని దుబాయ్ లోని భారత అధికారులు కోరుట్లలోని కుటుంబసభ్యులకు ఆదివారం రాత్రి తెలియజేశారు. దీంతో నవీన్ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది.
More From
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications