వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కిడ్నాప్‌కుగురైన మెడికో శ్రీకాంత్‌గౌడ్ కేసులో పురోగతి

ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్‌కు గురైన వైద్య విధ్యార్థి శ్రీకాంత్‌గౌడ్ కేసులో ఢిల్లీ పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసును క్షణంలోనైనా చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్‌కు గురైన వైద్య విధ్యార్థి శ్రీకాంత్‌గౌడ్ కేసులో ఢిల్లీ పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసును క్షణంలోనైనా చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.

కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ వాహనంలో ఉన్న జిపిఎస్‌ను ఆఫ్‌చేసి కారునెంబర్ ప్లేట్ మార్చి తిరుగుతున్నట్టు గుర్తించారు. అయితే నిందితుడు చాలా పకడ్బందీగా వ్యవహరించాడు.

<strong>ట్విస్ట్: ఐదోసారి కిడ్నాప్ చేశాడు, ఇంకా దొరకని గద్వాల యువకుడు శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ</strong>ట్విస్ట్: ఐదోసారి కిడ్నాప్ చేశాడు, ఇంకా దొరకని గద్వాల యువకుడు శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ

నిందితుడు ప్లాన్ ప్రకారంగా వ్యవహరించినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిందితుడిని పట్టుకొనేందుకుగాను పోలీసులు అన్నిరకాల చర్యలను తీసుకొంటున్నారు. 20 ప్రత్యేక బృందాలతో పోలీసులు నిందితుడిని పట్టుకొనేందుకు చర్యలను తీసుకొంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ అనే ఏసీపీ ఈ కేసును ఢిల్లీలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ఏ క్షణంలోనైనా పట్టుకొనే అవకాశం ఉందని పోలీసులు ఆశాభావంతో ఉన్నారు.

కిడ్నాప్‌లో ఆసక్తికర అంశాలు

కిడ్నాప్‌లో ఆసక్తికర అంశాలు

కిడ్నాప్ వ్యవహరంలో ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు పక్కా స్కెచ్‌తో వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్రోఫెషనల్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని నిర్ణయించుకొన్నాడని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ నెల 6వ, తేదిన ఉదయం నుండి ఎనిమిదిమంది ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకొన్నారు. అయితే వారితో వెళ్ళేందుకు నిరాకరించాడు. చివరకు శ్రీకాంత్‌గౌడ్ ప్రోఫెషనల్‌గా గుర్తించి అతనిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Recommended Video

Uber Cab Driver Suicide Attempt At Panjagutta Flyover
తప్పుడు ఐడితో లాగిన్

తప్పుడు ఐడితో లాగిన్

నిందితుడు లాగిన్ అయిన ఐడీ త్రిపాఠిదిగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. నాకేం తెలియదు. అంటూ అతడు సమాధానం చెబుతున్నాడు. ఏజంట్ అన్సారీని గతంలో కలిశానని, తన ఐడీలోకి లాగిన్ అవ్వడంలో సమస్య ఎదురైతే అన్సారీని సంప్రదించినట్టు చెప్పారు అయితే అన్సారీ అదే ఐడిని గుర్తుపెట్టుకొని కిడ్నాప్ చేసిన నిందితుడికి ఇచ్చి లాగిన్ చేయించినట్టు అన్సారీ, సంజయ్ త్రిపాఠీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఓలా సంస్థ వైఫల్యం

ఓలా సంస్థ వైఫల్యం

సరైన పత్రాలు లేక మూడుసార్లు తిరస్కరణకు గురైన వ్యక్తి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి ఇతర డ్రైవర్ల ఐడీ ద్వారా ధరఖాస్తు చేసుకొంటే ఎలా ఎంపిక చేస్తారని త్రిపాఠి ప్రశ్నిస్తున్నాడు.అయితే తనకు ఎలాంటి సంబంధంలేకున్నా తాను ఇరుక్కొన్నానని చెప్పారు. ఓలా తన క్యాబ్ సర్వీసులను నిలిపివేసిందని ఆవేదన చెందుతున్నాడు. ఏజంట్లు, కమీషన్ల కోసం తప్పుడు ధృవీకరణపత్రాలు సమర్పించి డ్రైవర్లను చేర్చుతున్నారని ఆరోపిస్తున్నాడు.

వెరిఫికేషన్ జరిగేలోపుగానే కిడ్నాప్

వెరిఫికేషన్ జరిగేలోపుగానే కిడ్నాప్

ఓలా సర్వీసులు నడపడానికి నిందితుడు సమర్పించిన పత్రాలు సక్రమంగా లేవని తేలిపోతాయి.అయితే ఆ లోపుగానే తన పనిని పూర్తిచేసుకోవాలని నిందితుడు ప్లాన్ చేశాడు. ఈ నెల4వ, తేదిన ఆయన ఓలాలో చేరాడు. ఈ నెల 6వ,తేదిన శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాప్ చేశాడు.

English summary
A medico from Telangana was kidnapped by driver of a Ola cab in New Delhi on Friday night. The kidnapper has reportedly demanded Rs 5 crore ransom from the cab owner to release the medico. The victim identified as Akkala Srikanth Goud (29) of Gadwal in Jogulamba Gadwal district. Srikanth, the only son of Janardhan Goud and Bharathamma, completed MBBS in China and was pursuing postgraduation in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X