నాణ్యమైన విద్య, సౌకర్యాలు మెరుగుపరుస్తాం: మంత్రి హరీశ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం రోటరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 145 ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు 7,593 బెంచీలను అందజేశారు.
మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిరుపేద విద్యార్ధుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం మంచిపరిణామని పేర్కొన్నారు.

నాణ్యమైన విద్య, సౌకర్యాలు మెరుగుపరుస్తాం: మంత్రి హరీశ్
విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడంతో మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. భవిష్యత్తులో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ధృడ సంకల్పంతో ముందుకు పోతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ శాఖలను విస్తరిస్తూ విద్యా, విజ్ఞానంతో పాటు విద్యార్ధులకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్న రోటరీని అభినందించారు.

నాణ్యమైన విద్య, సౌకర్యాలు మెరుగుపరుస్తాం: మంత్రి హరీశ్
అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో రోటరీ క్లబ్ సంస్ధ పాల్గొనాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి విద్యార్ది 10 మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యార్ధులకు సూచించారు.

నాణ్యమైన విద్య, సౌకర్యాలు మెరుగుపరుస్తాం: మంత్రి హరీశ్
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్ధులకు కోటి 82 లక్షల బెంచీలను అందజేసినట్లు రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కెఆర్ రవీంద్ర అన్నారు.
నాణ్యమైన విద్య, సౌకర్యాలు మెరుగుపరుస్తాం: మంత్రి హరీశ్
ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రోటరీ డైరెక్టర్ మనోజ్ దేసాయ్, ప్రొఫెసర్ శాంతి సిన్హా తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications