ఢిల్లీలో కేటీఆర్ ,అమిత్ షా, ఇతర మంత్రులతో భేటీ

తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో రెండవరోజు సైతం బిజీబిజీగా గడిపారు. బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన కేటీఆర్ గురువారం కూడ ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులకు కలిశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలకు వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రహోంమంత్రి, అమిత్ షా తోపాటు రైల్వే మరియు వాణిజ్య పన్నులు ,పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌గోయల్‌తో సమావేశం అయ్యారు.

అమిత్ షా భేటి

అమిత్ షా భేటి

దేశ రాజధాని ఢిల్లీలో మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ సదస్సుకు హజరైన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రెండోరోజు డిల్లీలోనే తన పర్యటన కొనసాగించారు. గురవారం అమిత్ షా కలిసిన కేటీఆర్ బేగంపేట్ వద్ద రసూల్‌పుర ప్రాంతలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌కు భూములు కేటాయించాలని కోరాడు. అక్కడ ప్రస్తుతం ఉన్న ఇంటర్ స్టేట్ పోలీస్ స్టాఫ్ క్వార్టర్స్‌ స్థలాన్ని తమకు కేటాయించాలని, దానికి బదులుగా వేరొక చోట రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని చెప్పారు.

పియూష్ గోయల్‌తో సమావేశం అయిన కేటీఆర్

పియూష్ గోయల్‌తో సమావేశం అయిన కేటీఆర్

అంతకు ముందు మంత్రి పియూష్‌గోయల్‌తో సమావేశం అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటికి నిధులు కేటాయించాలని కోరారు. దాంతో పాటు ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణ కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని , దీని వల్ల గ్రానైట్‌తో పాటు సిమెంట్, ఇనుము , ఇతర పండ్ల రవాణకు ఈజీ అవుతుందని వివరించారు.మరోవైపు విజయవాడ నుండి నల్గోండ మీదుగా హైదరాబాద్‌కు రోజువారిగా రైళ్లు నడపాలని మంత్రిని కోరారు.

 రాజ్‌నాథ్‌తో సమావేశం

రాజ్‌నాథ్‌తో సమావేశం

ఇక బుధవారం కూడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కి హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోవడం లేదని ఆయన మంత్రికి వివరించారు. స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిదని, ఇందుకోసం భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+